Jabardasth Faima: కమిట్‌మెంట్‌, వెన్నుపోటుపై ఓపెన్‌ అయిన ఫైమా.. సొంత తండ్రిపైనే హాట్‌ కామెంట్‌

Published : Apr 09, 2026, 02:37 PM IST

జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్‌ అయిన లేడీ కమెడియన్‌ ఫైమా తన గతం గురించి చెప్పింది. కమిట్‌ మెంట్‌, వెన్నుపోటు, బాడీ షేమింగ్‌ వంటి వాటిపై స్పందించింది. అమ్మాయిగా పుట్టొద్దని వెల్లడించింది. 

PREV
14
జబర్దస్త్ షోతో పాపులర్‌ అయిన ఫైమా

ఫైమా జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్‌ అయ్యింది. ఇప్పుడు స్టార్‌ కమెడియన్‌గా రాణిస్తోంది. ఓ వైపు కామెడీ షో, మరోవైపు ఈవెంట్లు చేస్తూ బిజీగా ఉంది. నిరుపేదగా వచ్చి, ఇప్పుడు తన ఫ్యామిలీని సెట్‌ చేసింది. బుల్లితెరపై టాప్‌ సెలబ్రిటీగా రాణిస్తోంది. తెలంగాణలోని ఓ పల్లెటూరికి చెందిన ఫైమా చిన్నప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించింది. తినడానికి తిండిలేని పరిస్థితి నుంచి వచ్చింది. ఇంట్లో సరిగా తిండిలేక బడికి వెళ్లాలనుకుంది. అక్కడే కడుపునిండా ఫుడ్‌ దొరుకుతుందని ఆమె భావించింది. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు సెలబ్రిటీగా మంచి లైఫ్‌ని లీడ్‌ చేస్తోంది ఫైమా.

24
ఫైమాపై బాడీ షేమింగ్‌ కామెంట్లు

ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫైమా ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన బాడీ షేమింగ్‌ కామెంట్లని వెల్లడించింది. కెరీర్‌ బిగినింగ్‌లో చాలా అవమానాలు ఫేస్‌ చేసిందట. ఇంత నల్లగా ఉన్నావని కామెంట్లు చేశారట. అందరు ఫైమా కావాలని కోరుకుంటే, కొంత మంది మాత్రం ఆమె వద్ద ఏముంది? ఎందుకు దాన్ని అంతగా పొగుడుతున్నారంటూ కామెంట్లు చేశారు. అందం లేదు, గలీజ్‌గా ఉంటది, నల్లగా ఉందంటూ విమర్శలు చేసిన వాళ్లు ఉన్నారని, దారుణంగా బాడీ షేమింగ్‌ కామెంట్లు చేశారని చెబుతూ, అలా పుట్టడంలో తన తప్పేముంది అంటూ వాపోయింది. ఎందుకమ్మా నన్ను నల్లగా కన్నావని అడిగితే కన్నీళ్లు పెట్టుకుందని తెలిపింది ఫైమా. అలాగే లవ్‌ స్టోరీ గురించి రివీల్‌ చేసింది. ఎనిమిదేళ్ల ప్రేమ అని, తన కోసం ఎన్నో అవమానాలు భరించాడని తెలిపింది ఫైమా.

34
కమిట్‌ మెంట్‌, వెన్నుపోటుపై ఫైమా

ఈ క్రమంలో కమిట్‌ మెంట్‌ గురించి స్పందించింది. యాంకర్‌గా ఉన్న వర్ష ఈ విషయాన్ని ప్రశ్నించగా, నన్ను ఎవరు అడిగేదంటూ కామెంట్‌ చేసింది. అలాగే వెన్నుపోటు గురించి రియాక్ట్ అవుతూ తాను మొదట్నుంచి ఎన్నో వెన్నుపోట్లు ఫేస్‌ చేసినట్టు వెల్లడించింది. ఇప్పటికీ వెన్నుపోట్లు పొడుస్తూనే ఉన్నారని, చాలా అలసిపోయానని, ఇక తనకు ఓపిక లేదని, తనని వదిలేయమని చెప్పింది ఫైమా. ఆడపిల్లగా పుట్టొద్దని, చాలా అవమానాలు ఫేస్‌ చేసినట్టు తెలిపింది. ఆడపిల్లగా బతకడం చాలా కష్టమని వెల్లడించింది. చాలా కష్టాలుంటాయని వెల్లడించింది. ఈ క్రమంలో తన తండ్రి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

44
తండ్రికి గతాన్ని గుర్తు చేయాలని దేవుడిని వేడుకుంటా

ఒకప్పుడు తమ జీవితం దారుణంగా ఉండేదని, అలాంటి సమయంలో అమ్మానాన్న పడ్డ కష్టాలు చూసి బాధకలిగిందని, వారిని మంచి స్థాయిలో నిలబెట్టాలని తాను కోరుకున్నట్టు తెలిపింది. కానీ ఇంట్లోనే డిస్టర్బెన్స్ క్రియేట్‌ అయ్యిందని చెప్పింది. అయితే ఇప్పుడు తాను ఎదిగాక, డబ్బులు వచ్చాక నాన్న జల్సాలు చేస్తున్నాడని, గతాన్నిమర్చిపోయి వ్యవహరిస్తున్నాడని, దుబారాగా తయారయ్యాడని, తనకు వస్తున్న డబ్బులన్నీ ఎక్కడికిపోతున్నాయో అర్థం కావడం లేదని వాపోయింది. సొంత తండ్రినే ఇలా చేయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అసలు తాను ఎవరికోసం కష్టపడుతున్నానో అర్థం కావడం లేదని, దేవుడిని ఏదైనా అడగాలంటే గతంలో ఎలా ఉన్నామో క్లీయర్‌గా నాన్నకి అర్థమయ్యేలా మళ్లీ గుర్తు చేయాలని కోరుకుంటాను అని తెలిపింది. ఓ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను పంచుకుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories