సన్నీ డియోల్‌, బాబీ డియోల్‌ లవ్‌ ఎఫైర్స్‌పై ధర్మేంద్ర ట్రోల్‌.. వాళ్ల ముందే ఈ స్టేట్‌మెంట్‌

Published : Nov 11, 2025, 02:07 PM IST

Dharmendra: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో  ఆయనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వైరల్‌ అవుతున్నాయి. తన కుమారులు సన్నీ, బాబీ డియోల్‌లను ట్రోల్‌ చేసిన విషయం చక్కర్లు కొడుతోంది.

PREV
15
కుమారులు సన్నీ డియోల్‌, బాబీ డియోల్‌ ఎఫైర్స్ పై ధర్మేంద్ర కామెంట్స్

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు, ఒకప్పటి రొమాంటిక్‌ హీరో ధర్మేంద్ర అనారోగ్యానికి సంబంధించిన రూమర్లు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకి గురి చేశాయి.  ఆయన మరణించినట్టు బాలీవుడ్‌ మీడియా కోడై కూయడంతో అంతా షాక్‌ అయ్యారు. ధర్మేంద్ర ఆరోగ్యంగానే ఉన్నారు, నిలకడగానే ఆయన ఆరోగ్యం ఉందని కూతురు ఈషాతోపాటు కుమారులు సన్నీ, బాబీ చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇంతలోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  లెజెండరీ నటుడికి దారుణమైన అవమానం జరిగిందని చెప్పొచ్చు. ఈ సందర్భంగా ధర్మేంద్రకి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.  అందులో భాగంగా ధర్మేంద్ర తన కుమారులు సన్నీ డియోల్‌, బాబీ డియోల్‌ ల ఎఫైర్స్ గురించి చేసిన కామెంట్స్  హల్‌చల్‌ చేస్తున్నాయి. 

25
‘అప్నే’ సెట్‌లో జరిగిన సంఘటనను వివరించిన అనిల్ శర్మ

ఫిల్మ్‌మేకర్ అనిల్ శర్మ, సిద్ధార్థ్ కనన్‌తో మాట్లాడుతూ, ధర్మేంద్ర గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. షూటింగ్ సమయంలో ధర్మేంద్ర తన కొడుకులను బాగా ఏడిపించేవారని శర్మ చెప్పారు. కొన్నిసార్లు సన్నీ, బాబీ అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చేదట.  ‘అప్నే’ సినిమా సెట్‌లో జరిగిన ఒక సంఘటనను అనిల్ శర్మ గుర్తుచేసుకున్నారు. ఆ సినిమాలో ధర్మేంద్ర, సన్నీ, బాబీ కలిసి నటించారు. ధర్మేంద్ర తన కొడుకులు అమాయకులని, వారికి హీరోయిన్లు పడరని సరదాగా అన్నారట. కానీ, సన్నీ, బాబీ అక్కడే ఉన్నారని ఆయన గమనించలేదన్నారు. 

35
నా కొడుకులు చాలా అమాయకులు అని చెప్పిన ధర్మేంద్ర

అనిల్ శర్మ చెప్పిన దాని ప్రకారం, ``మేమంతా వ్యానిటీ వ్యాన్‌లో కూర్చున్నాం. ధర్మేంద్ర 'నా కొడుకులు చాలా అమాయకులు` అని అన్నారు. వాళ్ళు అక్కడే ఉన్నారని ఆయన గమనించలేదు. `వీళ్ళకి ఏ హీరోయిన్‌తోనూ ఎఫైర్ లేదు. నా టైంలో హీరోయిన్లు నా వెంటే పడేవాళ్ళు` అన్నారు. ఇది విని సన్నీ, బాబీ సైలెంట్‌గా బయటకు వెళ్లిపోయారు`` అని తెలిపారు అనిల్‌ శర్మ. 

45
తాను కూడా అమాయకుడినే అని చెప్పుకున్న ధర్మేంద్ర

అనిల్ శర్మ  మరో ఆసక్తికర విషయాన్ని షేర్‌ చేసుకున్నారు. ``ధర్మేంద్ర మాట్లాడుతూ, 'వీళ్ళకి అవి అర్థం కాదు. చాలా అమాయకులు. నేను కూడా చాలా అమాయకుడిని' అని నవ్వారు``  అని చెప్పారు. ఆ  రోజుల్లో ధర్మేంద్ర చాలా  అందంగా ఉండేవారని, ప్రతి హీరోయిన్ ఆయనతో పనిచేయాలనుకునేదని శర్మ చెప్పారు.

55
ఈ హీరోయిన్లతో డియోల్ హీరోల ఎఫైర్లు

సినిమాల్లోకి రాకముందే ప్రకాష్ కౌర్‌ను పెళ్లి చేసుకున్న ధర్మేంద్ర.. అనితా రాజ్, హేమ మాలిని వంటి హీరోయిన్లతో ఎఫైర్స్ నడిపినట్టు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత హేమ మాలినిని పెళ్లి చేసుకున్నారు. సన్నీ డియోల్ పేరు అమృతా సింగ్, డింపుల్ కపాడియాతో వినిపించింది. కానీ, అతను పూజను పెళ్లి చేసుకున్నాడు. బాబీ డియోల్ పేరు హీరోయిన్‌ నీలంతో వినిపించినా, తాన్యా అహూజాతో పెళ్లయింది. ప్రస్తుతం సన్నీ డియోల్‌ హీరోగా బిజీగా ఉన్నారు. మరోవైపు బాబీ డియోల్‌ విలన్‌గా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories