శ్రీదేవి హీరోయిన్‌, సూపర్‌హిట్ తండ్రీకొడుకుల జోడి, భారీ బడ్జెట్, అయినా డిజాస్టర్.. ఆ మూవీ ఏంటో తెలుసా?

Published : Mar 12, 2025, 10:25 AM IST

Sultanat: బాలీవుడ్‌ మూవీ `సల్తనత్` విడుదలై 39 సంవత్సరాలు పూర్తయ్యాయి.  శ్రీదేవి, ధర్మేంద్ర, సన్నీ డియోల్‌ వంటి భారీ కాస్టింగ్‌, అలాగే భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రిజల్ట్ షాకిచ్చింది. ఆ కథేంటో చూద్దాం. 

PREV
18
శ్రీదేవి హీరోయిన్‌, సూపర్‌హిట్ తండ్రీకొడుకుల జోడి, భారీ బడ్జెట్, అయినా డిజాస్టర్.. ఆ మూవీ ఏంటో తెలుసా?
sultanat movie

39 సంవత్సరాల క్రితం వచ్చిన ముకుల్ ఆనంద్ చిత్రం `సల్తనత్‌`ను అర్జున్ హింగోరానీ నిర్మించారు.  పాపులర్‌ బాలీవుడ్ నటులతో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే కుప్పకూలింది.

28
sultanat movie

దర్శకుడు ముకుల్ ఆనంద్ చిత్రం `సల్తనత్` 1986లో విడుదలైంది. ఈ చిత్రంలో ధర్మేంద్ర, సన్నీ డియోల్, శ్రీదేవి, జూహీ చావ్లా, అమ్రీష్ పురి, శక్తి కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ద్వారా శశి కపూర్ కుమారుడు కరణ్ కపూర్ అరంగేట్రం చేశారు.

38
sultanat movie

`సల్తనత్`.. సన్నీ డియోల్, ధర్మేంద్ర కలిసి నటించిన రెండవ చిత్రం. దీనికి ముందు వీరిద్దరూ సన్నీ చిత్రంలో కనిపించారు. కానీ ఈ చిత్రంలో వీరిద్దరికీ కలిసి ఉన్న సీన్‌ ఒక్కటి కూడా లేదు.  అది అభిమానులను కొంత డిజప్పాయింట్‌ చేసింది. 

48
sultanat movie

`సల్తనత్` చిత్రం ద్వారా జూహీ చావ్లా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇందులో ఆమె ఓ కీలక పాత్రలో కనిపించింది. ఇది ఆమెకి ఆశించిన ఫలితాన్నివ్వలేదు, కానీ ఆమె మెయిన్‌ హీరోయిన్‌గా నటించిన  `కయామత్ సే కయామత్ తక్` బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. జూహీ చావ్లాకి బ్రేక్‌నిచ్చింది. 

58
sultanat movie

`సల్తనత్` చిత్రంలో జరీనా పాత్ర కోసం మొదట అనితా రాజ్‌ను ఎంపిక చేశారు, కానీ తరువాత ఆమెను తొలగించి జూహీ చావ్లాను తీసుకున్నారు. 

68
sultanat movie

`సల్తనత్` చిత్రం విడుదలైన తర్వాత దర్శకుడు ముకుల్ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ, ఇది చాలా పెద్ద ఫ్లాప్‌గా నిలుస్తుందని తనకు మొదటి రోజునే తెలిసిపోయిందన్నారు. ఈ సినిమా బడ్జెట్ చాలా పెరిగిపోయిందని, దీనివల్ల చాలా నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు.

78
sultanat movie

దర్శకుడు ముకుల్ ఆనంద్ సల్తనత్ చిత్రాన్ని 3 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ చిత్రం మొదటి రోజు 6 లక్షల రూపాయల బిజినెస్ చేసింది.  మొదటి వారం రూ.40 లక్షలు వసూలు చేసింది. ఓవరాల్‌గా ఇది బాక్సాఫీస్ వద్ద రూ.1.28 కోట్లు వసూలు చేసింది. దీంతో డిజాస్టర్‌గా ప్రకటించారు.

88
sultanat movie

నిర్మాత అర్జున్ హింగోరానీ తన ప్రతి సినిమా పేరును `ట్రిపుల్ కె`తో పెట్టడం ద్వారా ప్రసిద్ధి చెందారు. `సల్తనత్` పేరును కూడా ట్రిపుల్ కెతో పెట్టాలని అనుకున్నారు, కానీ దర్శకుడు ముకుల్ ఆనంద్ నిరాకరించారు. ఆ తరువాత హింగోరానీ టైటిల్ ట్రెండ్ బ్రేక్ కాకుండా ఉండేందుకు సల్తనత్ ముందు ‘కార్నామే కమాల్ కే’ అని పెట్టే ప్రతిపాదనను తీసుకువచ్చారు. అయితే, ఈ టైటిల్ సెట్ అవ్వలేదు.  అందరూ చెప్పడంతో సినిమా పేరును `సల్తనత్‌`గా ఉంచారు. కానీ ఇది ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. 

read  more: `సంక్రాంతికి వస్తున్నాం`, `డ్రాగన్‌`లతో `దిల్‌రూబా`కి పోలికలు.. కిరణ్‌ అబ్బవరం వివరణ ఇదే

also read: Aishwarya Rai vs Amitabh Bachchan: ఇద్దరిలో ఎవరి వద్ద ఎక్కువ డబ్బులున్నాయి? తెలిస్తే షాకే

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories