Allu Arjun Atlee Film Five Heroines: 2024లో రిలీజ్ అయిన అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ రికాడ్స్ ను బ్లాస్ట్ చేసింది. ఓవర్ సిస్ లో కూడా సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. పుష్ప పార్ట్ 3 కూడా ఉంటుందని మూవీ టీమ్ ప్రకటించారు, కాని ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ ఇవ్వలేదు. కోసం కొంచెం గ్యాప్ తీసుకుని అల్లు అర్జున్ పుష్ప 3 కోసం రంగంలోకి దిగుతాడని సమాచారం.
ఇక ఈ మధ్యలో పెండింగ్ సినిమాలు కంప్లీట్ చేయబోతన్నాడు బన్నీ. త్రివిక్రమ్ సినిమాతో పాటు, ఎప్పటి నుంచో అనుకుంటున్న అట్లీ సినిమా కూడా పూర్తి చేయాలని చూస్తున్నాడు అల్లు అర్జున్. రీసెంట్‌గా అట్లీ కుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ సినిమా స్టార్ట్ అవుతుంది అని న్యూస్ వైరల్ అయ్యింది. అంతే కాదు ఈసినిమాకు సబంధించిన మరో అప్ డేట్ కూడా వైరల్ అవుతోంది. అదేంటంటే అల్లు అర్జున్, అట్లీ సినిమాలో ఒక హీరోయిన్ కాదు, ఇద్దరు హీరోయిన్లు కాదు, మొత్తం 5గురు హీరోయిన్లు నటిస్తారని సమాచరం.
Also Read: నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా, అతన్ని అంత ప్రేమించిందా?