దిల్ రాజు మాస్టర్ స్ట్రోక్ : నెంబర్ వన్ డైరక్టర్ తో అల్లు అర్జున్ మీటింగ్?

Published : Mar 12, 2025, 09:23 AM IST

Allu Arjun: అల్లు అర్జున్ తో సినిమా చెయ్యటం  కోసం  ఓ పెద్ద డైరక్టర్ ని సీన్ లోకి తీసుకువచ్చారు.   వీరిద్దరితో సినిమా చేసేందుకు దిల్ రాజు మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారట. ఇంతకీ ఎవరా దర్శకుడు, ఏమా కథ. 

PREV
13
 దిల్ రాజు మాస్టర్ స్ట్రోక్  : నెంబర్ వన్  డైరక్టర్ తో  అల్లు అర్జున్ మీటింగ్?
Dil Raju Plays Matchmaker: Allu Arjun and Prashanth Neel to Meet Soon! in telugu


Allu Arjun:  అల్లు అర్జున్ ఇప్పుడు ఆల్ ఇండియాలో హాట్ ప్రాపర్టీగా మారిపోయారు. పుష్ప 2 తర్వాత మొత్తం లెక్కలు మారిపోయాయి. ఆ సినిమా కలెక్షన్స్ ప్రతీ దర్శకుడుని, నిర్మాతను అల్లు అర్జున్ తో సినిమా చేసేలా ఉత్సాహపరుస్తోంది.

అలాంటిది అల్లు అర్జున్ తో ఆల్రెడీ హిట్  సినిమాలు చేసిన దిల్ రాజు ప్రయత్నించటంలో వింతేముంది. అందులోనూ అల్లు అర్జున్ ...సంధ్య థియేటర్ వివాదం కేసులో ఇనీషియేషన్ తీసుకుని ప్రభుత్వంతో మాట్లాడి మొత్తం సెట్ చేసింది దిల్ రాజు.

దాంతో ఖచ్చితంగా దిల్ రాజుకు అల్లు అర్జున్ డేట్స్ ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. గేమ్ ఛేంజర్ డిజాస్టర్ తర్వాత అల్లు అర్జున్ ...దిల్ రాజు కలిసినప్పుడు ఆయనతో సినిమా చేస్తానని మాట ఇచ్చారట. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కు తగిన డైరక్టర్ ని సెట్ చేయాలి. అందుకోసం దిల్ రాజు అన్వేషణ పూర్తైందని, డైరక్టర్ సెట్ అయ్యాడంటున్నారు. ఆ డైరక్టర్ ఎవరు

23
Dil Raju Plays Matchmaker: Allu Arjun and Prashanth Neel to Meet Soon! in telugu

 ⭐ పవర్‌పుల్ కాంబినేషన్!

అల్లు అర్జున్ క్రేజ్ ని మ్యాచ్ చేయగలిగే దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇప్పటికే ప్రశాంత్ నీల్, కేజీఎఫ్, సలార్ లాంటి పాన్-ఇండియా హిట్స్ ఇచ్చిన మాస్ డైరెక్టర్. అల్లు అర్జున్ పుష్పతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న స్టార్.

ఇక దిల్ రాజు అయితే ఎన్నో ఇండస్ట్రీ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్. ఈ ముగ్గురు కలిసి ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తే మామూలుగా ఉండదు. అదే దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో గట్టిగా టాక్ వినిపిస్తోంది.

గతంలో ప్రశాంత్ నీల్ ...దిల్ రాజుతో సినిమా చేస్తానని మాట ఇచ్చారు. దాంతో ఇప్పుడు దిల్ రాజు, ప్రశాంత్ నీల్- అల్లు అర్జున్ మధ్య మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారట. ప్రశాంత్ నీల్ తో సినిమా అంటే కాదనేదేముంది

33
Dil Raju Plays Matchmaker: Allu Arjun and Prashanth Neel to Meet Soon! in telugu

🔥 మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్?

ప్రశాంత్ నీల్, అల్లు అర్జున్ ప్రాజెక్ట్‌ మొదలే కాకపోయినా, చర్చలు స్దాయిలోనే ఉన్నా సెట్ అవుతుందనే నమ్మకం అందరిలో ఉంది. దాంతో  ఇది పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ అవుతుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ పై ఫోకస్ పెట్టగా, అల్లు అర్జున్ ..అట్లీ సినిమా  కోసం రెడీ అవుతున్నాడు. వీరిద్దరూ తమ ప్రాజెక్ట్స్ పూర్తి చేసిన వెంటనే ఈ కాంబినేషన్ ఫిక్స్ అవుతుందని టాక్.

ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ యాక్షన్, అల్లు అర్జున్ ఎనర్జీ, దిల్ రాజు గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కలిస్తే.. మరో పాన్-ఇండియా బిగ్ బ్లాక్‌బస్టర్ పక్కా! ఈ సినిమా ఎప్పుడు అధికారికంగా అనౌన్స్ అవుతుందో చూడాలి!

Read more Photos on
click me!

Recommended Stories