Guppedantha Manasu: వసు నమ్మకాన్ని తన నమ్మకంగా మార్చుకున్న రిషి.. అత్తకు భలే కౌంటర్లు వేస్తున్న ధరణి!

Published : Nov 10, 2022, 12:21 PM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి ప్రేక్షకధారణ పొందింది. ఇక ఈ సీరియల్ తల్లి, కొడుకుల మధ్య నేపథ్యంలో ప్రసారమవుతుంది. ఇక ఈరోజు నవంబర్ 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
17
Guppedantha Manasu: వసు నమ్మకాన్ని తన నమ్మకంగా మార్చుకున్న రిషి.. అత్తకు భలే కౌంటర్లు వేస్తున్న ధరణి!

ఎపిసోడ్ ప్రారంభంలోనే.. వసుధార ఫస్ట్ రావటంతో జగతి, మహేంద్ర ఫోన్లో చూసి ఆనందపడతారు. గౌతమ్ కూడా జరిగిన విషయాలన్నీ వాళ్లకు చెబుతూ ఉంటాడు. రిషి చాలా సంతోషంగా ఉన్నాడని వసుధార మిమ్మల్ని మిస్ అవుతుంది అని అంటాడు. ఇప్పుడు అంత బాగానే ఉంది కదా సార్ అందరూ సంతోషంగా ఉన్నాం కదా ఇంక వచ్చేయండి అని అంటాడు గౌతమ్.
 

27

వాడు ఇక్కడ మీరు అక్కడ బాధపడటం ఏమీ బాగోలేదు అని అంటాడు. వెంటనే మహేంద్ర నాకు కూడా రిషి ని ఎప్పుడు ఎప్పుడు కలవాలా అని ఉంది అని కానీ రిషి జీవితంలో ఏది మిస్ అవ్వకూడదు అంటే కొన్ని రోజులు మమ్మల్ని మిస్ అవ్వక తప్పదు అని అంటాడు. దాంతో గౌతమ్ మీ బాధను చూడలేక మధ్యలో నేను నలిగిపోతున్నాను అని బాధపడతాడు.
 

37

ఇక వసు ఆలోచనలో ఉండగా రిషి వచ్చి ఫస్ట్ వచ్చినందుకు సెలెబ్రేట్ చేసుకోవాలి అని అంటాడు. ఇదంతా జగతి మేడం వల్ల అయింది అని రిషి అంటాడు. ఆ తర్వాత నీకేం కావాలో అని వసుధారని అడగటంతో మొదట వసు అడగటానికి ఇబ్బంది పడుతుంది. కానీ ఆ తర్వాత జగతి మేడం అని అనటంతో రిషి కాస్త కంగారు పడినట్లు కనిపిస్తాడు.

47

వెంటనే వసు అవును సార్ నేను ఇంత విజయాన్ని సాధించాను అంటే జగతి మేడం కారణం అని.. తనకు నేను ఏమీ చేయలేక పోతున్నాను అని అంటుంది. ఇక జగతి మేడంకు పాదాభివందనం చేయాలి అని అంటుంది. దాంతో రిషి నీకేం కావాలో చెప్పు అనటంతో వెంటనే వసు రిషిని ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్తుంది.
 

57

అక్కడ పేపర్ మీద జగతి మేడం వాళ్ళు తిరిగి రావాలన్న తన కోరికను రాసి పడవను వదిలేస్తుంది. దాంతో రిషి కూడా నువ్వు ఇలాంటివన్నీ బాగా నమ్ముతావు కదా నేను కూడా నీకోసం వదులుతాను అని అంటాడు. ఇక రిషి కూడా త్వర త్వరగా పడవలు చేయటంతో మీరు ఇంత ఫాస్ట్ గా ఎలా నేర్చుకున్నారు అని అంటుంది.
 

67

దాంతో రిషి నా గురువుగారు నేర్పించారు అని వసు పేరు చెబుతాడు. వసు నేనెప్పుడు నేర్పించాను అనటంతో గతంలో ఓసారి నేర్పించావు అని అంటాడు. ఇక రిషి ఇంటికి రాకపోయేసరికి దేవయానికి బాగా  అనుమానం వస్తుంది. వెంటనే ధరిణిని పిలిచి గ్రీన్ టీ కావాలని అడుగుతుంది. ఇక ధరణి వసు కాలేజ్ ఫస్ట్ వచ్చినందుకు రిషి స్వీట్ చేయమన్నాడు అని అంటుంది.

77

దాంతో దేవయానికి కోపం రావడంతో.. ఒకవేళ రిషి వచ్చి అడుగుతే మీరు వద్దన్నారని చెబుతాను అని అంటుంది. దాంతో దేవయాని భయపడి బెదిరిస్తున్నావా అని అంటుంది. అంతేకాకుండా ధరణి కొన్ని వెటకారపు డైలాగులు కూడా కొడుతుంది. ఇక రిషి, వసు తమ కోరికలను కోరుకొని చెరువులో పడవలను వదిలేస్తారు. ఇక దేవయాని దగ్గరికి గౌతమ్ వచ్చి జరిగిన విషయాలు చెప్పటంతో దేవాయానికి బాగా కోపం వస్తుంది.

click me!

Recommended Stories