కానీ కార్తీక్ నీ భర్త కోసం నువ్వు ఎలా పూజ చేస్తున్నావో తను కూడా అలా పూజ చేస్తుంది అందుకే 10,000 ఇచ్చాను అని అంటాడు. దాంతో మోనిత షాక్ అవుతుంది. అప్పుడే దుర్గ అక్కడికి వచ్చి తను వేసుకున్న షూ చూయించి మోనిత తో నువ్విచ్చిన పదివేలతో చెప్పులు కొనుక్కున్నాను అని అంటాడు. దాంతో కార్తీక్ షూ కొనివ్వటానికి 10,000 ఇవ్వచ్చు కానీ పూజ కోసం నేను డబ్బులు ఇస్తే తప్పుగా అనిపించిందా అని అంటాడు. ఇక కార్తీక్ మాటలకు తిరిగి దీపకు డబ్బులు ఇస్తుంది మోనిత.