చాలా నెర్వస్ గా ఉంది... అది జరగాలని కోరుకుంటున్నా: సమంత ఎమోషనల్ పోస్ట్

Published : Nov 10, 2022, 11:07 AM ISTUpdated : Nov 10, 2022, 11:14 AM IST

సమంత మరో ఇంట్రెస్టింగ్ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. యశోద విడుదలకు ఒక రోజు మాత్రమే మిగిలి ఉండగా... నెర్వస్ గా ఉందని వెల్లడించారు. అలాగే సినిమా ప్రేక్షకులకు నచ్చాలని కోరుకుంటున్నాను, అన్నారు.   

PREV
16
చాలా నెర్వస్ గా ఉంది... అది జరగాలని కోరుకుంటున్నా: సమంత ఎమోషనల్ పోస్ట్
Samantha

సమంత కమిట్మెంట్ ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. ప్రమాదకర వ్యాధితో పోరాడుతున్న సమంత యశోద మూవీ డబ్బింగ్ పూర్తి చేశారు. అలాగే నిర్మాతల కోసం ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. చాలా మంది హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తీసుకున్నామా సినిమా పూర్తి చేశామా... అన్నట్లు ఉంటారు. ప్రమోషన్స్ కి రమ్మని అడిగితే అయిష్టంగానే హాజరవుతారు. పొరపాటున చిన్న సమస్య వస్తే షూటింగ్ కి ఎలా డుమ్మా కొట్టాలా అని చూస్తారు. 
 

26
Samantha

స్టార్ లేడీ సమంత తాను ప్రత్యేకమని చాటుకున్నారు. యశోద చిత్రీకరణలో ఉండగానే సమంతకు మయోసైటిస్ సోకినట్లు తెలుసు. ఆ కారణంగా షూటింగ్ వాయిదా వేస్తే నిర్మాత భారీగా నష్టపోతాడు. అందులోనూ యశోద ఆమె ప్రధాన పాత్రలో చేస్తున్న పాన్ ఇండియా చిత్రం. సమంతపై నమ్మకంతో ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి పెట్టకూడనంత బడ్జెట్ పెట్టారు. 
 

36

ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న సమంత అనారోగ్యంతో పోరాడుతూ యశోద చెప్పిన టైం కి విడుదల చేయడంలో సహకారం అందించింది. చేతికి సెలైన్ పెట్టుకొని డబ్బింగ్ చెప్పింది. ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలో పాల్గొంది సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పిస్తుంది. 

46

ఇక యశోద చిత్ర విడుదలకు ఒక రోజు సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో సమంత ఇంస్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. యశోద విడుదలకు మరో రోజు మాత్రమే మిగిలి ఉంది. నాకు నెర్వస్ గా అనిపిస్తుంది. సినిమా మీకు నచ్చాలని కోరుకుంటున్నాను. నాలాగే ఆతృతగా ఎదురుచూస్తున్న యశోద మూవీ టీమ్ కి నా బెస్ట్ విషెస్.. . అని కామెంట్ పోస్ట్ చేశారు. 

56


యశోద మూవీపై పాజిటివ్ బజ్ నడుస్తుంది. ట్రైలర్ ఆసక్తి పెంచేయగా ఫ్యాన్స్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. సరోగసీ నేపథ్యంలో మెడికల్ మాఫియా ప్రధానంగా యశోద తెరకెక్కింది. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక రోల్స్ చేశారు. నవంబర్ 11న యశోద 5 భాషల్లో భారీ ఎత్తున విడుదల అవుతుంది. 

66

ఇక లేటెస్ట్ ఇంటర్వ్యూలో సమంత తన ఆరోగ్యంపై ఒక స్పష్టత ఇచ్చారు. ప్రస్తుత ఆమె మెడికల్ కండిషన్ తెలియజేశారు. మీడియాలో వచ్చినట్లు ఇదేమీ ప్రాణాంతకం కాదు. అలా అని చిన్న సమస్య కూడా కాదు. ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నాను. భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పలేను. నేనైతే చనిపోలేదు బ్రతికే ఉన్నానంటూ సమంత వెల్లడించారు. 
 

click me!

Recommended Stories