కోలీవుడ్ లో స్టార్ డమ్ తో దూసుకుపోతున్నాడు ధనుష్. తమిళంతో పాటు తెలుగులో కూడా ధనుష్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఎంత స్టార్ హీరోనో.. అన్ని వివాదాల్లో చిక్కుకున్నాడు ధనుష్. రీసెంట్ గా హీరోయిన్ నయనతార ధనుష్ పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ధనుష్ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. కానీ ఆయన తండ్రి మాత్రం నయనతార చెప్పిందంతా అబద్ధం అని అన్నారు. ఈ వివాదం ఒకవైపు నడుస్తుండగా, ధనుష్ వ్యక్తిగత జీవితంలో మరో సమస్య కోర్టుకు చేరింది.
నటుడు ధనుష్, సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్యను 2004లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. 18 ఏళ్ల తర్వాత, 2022లో వీరు విడిపోతున్నట్టు ప్రకటించారు.
ఇంతకు ముందు రెండు సార్లు విచారణకు వచ్చినప్పుడు ధనుష్, ఐశ్వర్య కోర్టుకు రాలేదు. దీంతో వీరు మళ్ళీ కలిసి ఉంటారని ప్రచారం జరిగింది. 'వేటతైయన్' సినిమాను కలిసి చూడటం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది.
తాజాగా మరోసారి ధనుష్ - ఐశ్వర్యల విడాకుల కేసు విచారణకు వచ్చింది. ఉదయం 10:30 గంటలకు ఐశ్వర్య కోర్టుకు వచ్చారు. ధనుష్ రావడం ఆలస్యం కావడంతో కేసు 12 గంటలకు వాయిదా పడింది. 11:30కి ధనుష్ కోర్టుకు చేరుకున్నారు. 12 గంటలకు ఇద్దరూ జడ్జి ముందు హాజరయ్యారు.
66
కోర్టు తీర్పు
ఇద్దరూ కలిసి బ్రతకడం ఇష్టం లేదని, వివాహ బంధాన్ని రద్దు చేయాలని జడ్జిని కోరారు. జడ్జి ఈ కేసు తీర్పును 27వ తేదీకి వాయిదా వేశారు.