తిరుపతిలో పుష్ప 2, అమరావతిలో గేమ్ ఛేంజర్.. ప్రీ రిలీజ్ ఈవెంట్లపై ఉత్కంఠ..

First Published | Nov 21, 2024, 2:41 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ చిత్రం డిసెంబర్ 5 కనీవినీ ఎరుగని గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆల్రెడీ పాట్నాలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఇండియాలో మిగిలిన ప్రాంతాల్లో కూడా పుష్ప 2 ఈవెంట్స్ ఉండబోతున్నాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ చిత్రం డిసెంబర్ 5 కనీవినీ ఎరుగని గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆల్రెడీ పాట్నాలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఇండియాలో మిగిలిన ప్రాంతాల్లో కూడా పుష్ప 2 ఈవెంట్స్ ఉండబోతున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రొమోషన్స్ చాలా ముఖ్యం. పుష్ప 2 ప్రీరిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహించాలా లేక ఆంధ్రలోనా అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. 

నిర్మాతల ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించే అవకాశాలు తక్కువ అని తెలుస్తోంది. హైదరాబాద్ లో కొన్ని ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీనితో పోలీసుల అనుమతులు కష్టం. ఆంధ్రలో అయితే సమస్య ఉండదు. తిరుపతి లేదా చిత్తూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తే ఎలా ఉంటుంది అని నిర్మాతలు పరిశీలిస్తున్నారు. 


ఎర్ర చందనం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం కాబట్టి తిరుపతి, చిత్తూరు అయితే లోకల్ సెంటిమెంట్ ఉంటుంది. ఈ నెల 27 తర్వాతే పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ అనేది క్లారిటీ వస్తుంది. అప్పటికి హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు ఎత్తివేస్తారు. అదే విధంగా 24వ తేదీ చెన్నైలో, 27వ తేదీ కొచ్చిలో కూడా ఈవెంట్లు పూర్తవుతాయి. 

ఇక గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై కూడా ఉత్కంఠ నెలకొంది. పవన్ కళ్యాణ్ ని గెస్టుగా తీసుకువచ్చేందుకు రాంచరణ్, దిల్ రాజు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారట. అయితే పవన్ ఎప్పుడు సమయం ఇస్తారో తెలియదు. అమరావతిలో కానీ, గోదావరి జిల్లాల్లో కానీ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Latest Videos

click me!