అప్పుడు మాధవ్, ఇన్నాళ్లు నేను అక్కడే పోరాడాను ఇప్పుడు నువ్వు కూడా నాకు సపోర్ట్ ఇచ్చావు, ఇంకెప్పుడు ఇటువైపు పంపను వెళ్ళొస్తాను అని దేవిని తీసుకొని వెళ్ళిపోతాడు మాధవ్. ఆ తర్వాత సీన్లో చిన్మయి గార్డెన్లో కూర్చుని రుక్మిణి, ఆదిత్య భార్య అని నిజం తెలిసిన విషయం గురించి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రుక్మిణి పాలు తీసుకొని అక్కడికి వచ్చి,చిన్మయి, ఏం ఆలోచిస్తున్నావు అని అడగగా, అమ్మ నిజంగానే దేవి నీ నువ్వు ఆఫీసర్ సార్ ఇంట్లో వదిలేస్తావా? ఇంక దేవీ నాతో ఉండదా? నాకు నీతో పాటు దేవి కూడా కావాలి అమ్మ నేను ఇద్దరితోనూ ఉంటాను.