తాను ఎప్పుడూ ప్రీ రిలీజ్ ఈవెంట్లకి వస్తుంటానని, కానీ ఈ రోజు తనకు లోపల ఏదో టెన్షన్ ఉందని, అదేంటో అర్థం కావడం లేదన్నారు.మీరు చేసిన అల్లరే దానికి కారణమేమో అని చెప్పారు. నాకు తెలిసి ఇక్కడికి పాలకొల్లు నుంచి వచ్చారేమో, అందుకే టెన్షన్ పడుతున్నాననుకుంటా, ఎందుకంటే పాలకొల్లు వాళ్లంటే నాకు భయం అని చెబుతూ నవ్వులు పూయించారు. మరి పాలకొల్లు అభిమానులంటే ఆయనకు భయం ఎందుకనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అయితే తాను ఊరికే జోక్ చేశానని, మా సొంతూరు పాలకొల్లు అని వెల్లడించడం విశేషం. తన సొంతూరు వాళ్లంటే అభిమానంతో సరదాగా బన్నీ అలా చెప్పాడా? అనేది ఆసక్తికరంగా మారింది.