ఎక్కడ అమ్మ, అఖిల్ ని తిడుతుందేమో అని భయపడుతూ అఖిల్ నిజం దాస్తున్నాడు.నేను ఎంత ధైర్యం చెప్పిన సరే అసలు వినడం లేదు.మరి దీనికి ఇంకేం పరిష్కారం లేదా అని రామా అనగా, డిఎన్ఎ టెస్ట్ ఉన్నది రామ గారు అని జానకి అనగా అంటే ఏంటండి అని అడుగుతాడు రామ. అఖిల్ రక్తం తీసుకొని అది జెస్సి ఒంట్లో ఉన్న బిడ్డకు మ్యాచ్ చేస్తే, ఆ రెండు ఒకటి అవుతాయి అని మనకు ఒక రిపోర్టు వస్తుంది. అది అత్తయ్య గారికి చూపించాలి కానీ అఖిల్ రక్తం ఎలా దొరుకుతుంది? అత్తయ్య గారు ఒప్పుకోరు అని అనగా అమ్మని నేను ఒప్పిస్తాను జానకి గారు అని అంటాడు రామా.