Devatha: తన కోడలు బతికే ఉందని తెలుసుకున్న దేవుడమ్మ.. దుఃఖంలో మునిగిపోతున్న రుక్మిణి!

Published : May 21, 2022, 01:40 PM IST

Devatha: బుల్లితెరపై ప్రసారం అవుతున్న దేవత (Devatha) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు మే 21 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Devatha: తన కోడలు బతికే ఉందని తెలుసుకున్న దేవుడమ్మ.. దుఃఖంలో మునిగిపోతున్న రుక్మిణి!

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే రుక్మిణి ను తన కూతురును మా అమ్మ వా? అని అడిగినందుకు ఎంతో దుఃఖము వ్యక్తం చేస్తుంది. మరోవైపు దేవుడమ్మ భాగ్యమ్మ బిడ్డ గురించి అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు మాధవ లక్ష్మి పోటో వైపు చూసుకుంటూ దేవి నీ బిడ్డ అని దేవి కి ఎలా చెప్పాలి అంటూ బాధపడతాడు.
 

26

ఇదంతా దేవి (Devi) వినాలని మాధవ పథకం ప్రకారం అంటాడు. ఇక ఆ మాటలు విన్న దేవి ఆశ్చర్యపోతుంది. అంతేకాకుండా బీరువాలో ఉన్న లక్ష్మి ఫోటోను చూస్తుంది. మరోవైపు దేవుడమ్మ (Devudamma)  ఆదిత్య దగ్గరికి వెళ్లి సత్యను హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాలి అని అంటుంది.
 

36

ఇక ఆదిత్య (Adithya) అంతగా కావాలంటే సత్యను నేనే హాస్పిటల్ కి వెళ్లి చూపిస్తాను అని అంటాడు. ఇక దేవుడమ్మ నీ బిడ్డకు సంతాన యోగం ఉంది అని తేల్చి చెప్పారు. అందుకే తీసుకెళ్లాలని అంటున్నాను అని చెబుతుంది. ఇక దేవుడమ్మ (Devudamma) ఆ స్వామీజీ దగ్గరికి వెళ్లగా మీ ఆదిత్య.. ఆ ఆదిత్యుడి లా వెలుగు తాడు అని చెబుతాడు.
 

46

ఇక ఆ స్వామీజీ రుక్మిణి (Rukmini) జాతకం చూసి ఆ అమ్మాయి చనిపోవడం ఏమిటమ్మా..  ఆమె పూర్ణ ఆయుష్క్ రాలు. ఆమె అర్ధాంతరంగా చనిపోవడం జరగదు అని అంటాడు. దాంతో దేవుడమ్మ (Devudamma) ఒకసారిగా స్టన్ అవుతుంది. ఇక నీ  కోడలు ప్రాణాలతో ఉంటుంది ఇది సత్యం అని ఆ స్వామిజీ చెబుతాడు.
 

56

ఇక ఇదంతా దేవుడమ్మ (Devudamma) సత్య దంపతులకు తెలిపి, ఆ రుక్మిణి కూడా బతికే ఉంటుంది అని అనిపిస్తుంది అని అంటుంది. ఇక దేవుడమ్మ నిజంగానే ఆ స్వామిజీ చెప్పిన మాట నిజమే అయితే బాగుంటుంది అని సంతోషపడుతుంది. ఇక మనసులో ఆదిత్య (Adithya) ఆ స్వామీజీ చెప్పింది నిజమే అమ్మ అని అనుకుంటాడు.
 

66

అంతేకాకుండా ఆదిత్య (Adithya) ప్రస్తుతం రుక్మిణి   (Rukmini) ఒక భర్త కి భార్య గా ఇద్దరు పిల్లలతో ఉంది. అందులో నా కూతురు కూడా ఉంది. ఈ విషయం నీకు ఎలా చెప్పాలలో అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటాడు. మరోవైపు రుక్మిణి తన కూతురు విషయంలో దిగులు పడుతూ ఉంటుంది. ఇక ఈ క్రమంలో  రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories