క్రేజీ న్యూస్.. కమల్ హాసన్ సినిమాలో సాయి పల్లవి, క్యారెక్టర్ ఏంటో తెలుసా..?

Published : May 21, 2022, 01:04 PM IST

కమల్ హాసన్  సినిమాలో సాయి పల్లవి. ఇండస్ట్రీలో అందరికి ఇంట్రెస్ట్ కలిగించే ఈ క్రేజీ న్యూస్  లో నిజమెంత.ఒక వేళ చేసినా.. ఏ పాత్ర చేస్తుంది..?

PREV
17
క్రేజీ న్యూస్.. కమల్ హాసన్ సినిమాలో సాయి పల్లవి,  క్యారెక్టర్ ఏంటో తెలుసా..?

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో హీరోయిన్ గా సాయిపల్లవి క్రేజ్ తెలిసిందే. అన్ని భాషల్లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. తెలుగులో ఈ మధ్య  కాలంలో ఆమె చేసిన  శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ లాంటి సినిమాలు  భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. 

27

ఇక టాలీవుడ్ నుంచి ఆ తరువాత సినిమాగా ఆడియన్స్ ను పలకరించడానికి విరాటపర్వం రెడీ అవుతోంది. ఇక ఇది అలా ఉంచితే..  తమిళంలో సాయి పల్లవి  ఒక సినిమా చేయడానికి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం అందుతోంది. అయితే అది కమల్ హాసన్ మూవీ అని తెలుస్తోంది. 

37

సాధారణంగా సాయి పల్లవి సినిమలు అంత తేలిగ్గా ఒప్పుకోదు. ఎంత స్టార్ హీరో అయినా.. కథలో హీరోయిన్ పాత్రకు ఇంపార్టెన్స్ లేకపోతే.. నిర్దాక్షణ్యంగా నో చెప్పేస్తుంది. మరి కమల్ హాసన్ సినిమాల్ ఆమె ఎలా ఒప్పుకుంది అనేది పెద్ద చర్చగా మారింది. అయితే అక్కడే చిన్న ట్విస్ట్ ఉంది.   

47

సాయి పల్లవి నటించేది కమల్ హాసన్ సినిమాలో అయినా.. కోలీవుడ్ యంగ్ హీరోల్లో శివ కార్తికేయన్ జంటగా సాయిపల్లవి నటిస్తంది. ఈసినిమాకు కమల్ హాసన్ నిర్మాత మాత్రమే అని తెలుస్తోంది. హీరోగా శివకార్తికేయన్ ఈసినిమాలో నటిస్తున్నాడు. అంటే శివకు జోడీగా సాయి పల్లవి సందడి చేయబోతోంది. 

57

యంగ్ స్టార్ శివకార్తికేయన్ తమిళ్ లో  ఇప్పుడు మాంచి జోష్ తో ఉన్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఆయన ముందుకు దూసుకుపోతున్నాడు. తాజాగా ఒక సినిమా చేయడానికి ఆయన రంగంలోకి దిగారు. సోనీ పిక్చర్స్ తో కలిసి కమల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 
 

67

ఈ సినిమాకి 'మావీరన్' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.ఈ సినిమాలో శివ కార్తికేయన్ .. ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తాడట. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు సాయిపల్లవిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

77

ఈ సినిమా కథ వినగానే సాయి పల్లవి ఒకే చేసేసిందని సమాచారం. ఇక సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జైరాజ్ ఈ సినిమాకి స్వరాలు సమకూర్చుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్టు సమాచారం. 

Read more Photos on
click me!

Recommended Stories