NTR30: ఎన్టీఆర్ కి హీరోయిన్ గా బికినీ బ్యూటీ, బిగ్ ట్విస్ట్.. నిజమైతే ఫ్యాన్స్ కి టెన్షన్ తప్పదా ?

First Published May 21, 2022, 1:34 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిన్ననే తన 39వ జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించబోయే సినిమాలపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిన్ననే తన 39వ జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించబోయే సినిమాలపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. బర్త్ డే సందర్భంగా కొరటాల శివ దర్శకత్వంలో, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చిత్రాలని అధికారికంగా ప్రకటించారు. ఫ్యాన్స్ పండగ చేసుకునేలా పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. 

ముందుగా ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ విషయంలో ఇంకా సస్పెస్ కొనసాగుతోంది. పాన్ ఇండియా చిత్రం కావడంతో నార్త్ హీరోయిన్స్ ని పరిశీలిస్తున్నారు. ముందుగా అలియా భట్ పేరు వినిపించింది. కానీ ఈ చిత్రం నుంచి అలియా తప్పుకుంది. ఆ తర్వాత సాయి పల్లవి పేరు కూడా వినిపించింది. కానీ ఆమె కూడా ఖరారుకాలేదు. 

Latest Videos


తాజాగా ఓ ఊహించని బోల్డ్ బ్యూటీ పేరు చక్కర్లు కొడుతోంది. నిత్యం సోషల్ మీడియాలో బోల్డ్ పిక్స్, బికినీ ఫొటోలతో వేడెక్కించే దిశా పటాని ఎన్టీఆర్ 30లో హీరోయిన్ గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది జీజంగా పెద్ద ట్విస్ట్ అని చెప్పొచ్చు. దిశా పటాని గ్లామర్ పరంగా బాలీవుడ్ లో ఎంత పాపులారిటీ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

పాపులారిటీ ఉన్నప్పటికీ దిశా పటానికి సక్సెస్ రేట్ చాలా తక్కువ. తెలుగులో నటించిన ఏకైక చిత్రం లోఫర్ డిజాస్టర్ గా నిలిచింది. బాలీవుడ్ లో గ్లామర్ నెట్టుకుని వస్తోంది. అంతే తప్ప విజయాలు అయితే ఆమెకు పెద్దగా లేవు. ఒక వేళ ఎన్టీఆర్ 30లో దిశా పటాని ఫైనల్ అయితే ఈ ఈ విషయాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంగారు పడక తప్పదు. 

Image: Disha PataniInstagram

గ్లామర్ పరంగా ఎలాంటి హద్దులు లేని దిశా పటాని లవ్ ఎఫైర్ వార్తలతో కూడా పబ్లిసిటీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం దిశా.. టైగర్ ష్రాఫ్ తో డీప్ ఎఫైర్ కొనసాగిస్తోంది. 

అందాలు ఆరబోస్తూ డాన్స్ బాగా చేస్తుందనే ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఎన్టీఆర్ కి డాన్స్ తో తిరుగులేదు కనుక.. అతడి పక్కన దిశా సెట్ అవుతుందే కామెంట్స్ కూడా ఉన్నాయి. మరో వైపు కొరటాల శివ శ్రద్దా కపూర్ పేరుని కూడా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి చూడాలి ఆ లక్కీ ఛాన్స్ దక్కించుకునే బ్యూటీ ఎవరో!

click me!