ఆ తర్వాత సీన్ లో జానకమ్మ కుర్చీలో కూర్చుని బాధపడుతూ ఉండగా. దేవి,చిన్మయి లు అక్కడికి వచ్చి డాన్స్ చేస్తూ, కరాటే చేస్తూ జానకమ్మని టైం పాస్ చేపిస్తూ ఉంటారు. ఇంతలో ఆదిత్య, రుక్మిణి అక్కడికి వస్తారు.రాధ ఆదిత్య దగ్గరికి వెళ్లిందా అని మాధవ్ అనుకుంటాడు. ఇంతలో ఆదిత్య, డాక్టర్ గారికి యాక్సిడెంట్ అయింది తను వైద్యం చేయడం కుదరదు అని అనగా అందరూ బాధపడి, ఇంకేమి దారి లేదా!వైద్యం చేస్తే త్వరగా నయమవుతుంది అనుకున్నాం కదా అని అనగా ఆదిత్య, నాకు తెలిసిన ఒక ప్రకృతి వైద్యశాల ఉంది. అక్కడికి తీసుకువెళ్తే కచ్చితంగా నయమవుతుంది అని అంటాడు.