`ది ఘోస్ట్` v/s `గాడ్‌ఫాదర్‌`.. చిరంజీవిని భయపెడుతున్న `లూసీఫర్‌`, నాగ్‌ని ఊరిస్తున్న టాక్‌.. బిగ్‌ ఫైట్‌

First Published Oct 3, 2022, 10:48 AM IST

మెగాస్టార్‌ చిరంజీవి,  మన్మథుడు నాగార్జున ఇండస్ట్రీలో మంచి స్నేహితులు. కానీ ఈ ఇద్దరు రెండు సినిమాల కోసం పోటీపడుతున్నారు. బాక్సాఫీసు వద్ద నువ్వా నేనా అని తేల్చుకోబోతున్నారు.

చిరంజీవి `గాడ్‌ ఫాదర్‌` చిత్రంలో నటించారు. నాగార్జున `ది ఘోస్ట్` చిత్రంలో నటించారు. `గాడ్‌ ఫాదర్‌` పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందింది. `ది ఘోస్ట్` యాక్షన్‌ క్రైమ్‌  థ్రిల్లర్‌గా రూపొందింది. రెండూ ఒకే రోజు దసరా సందర్భంగా అక్టోబర్‌ 5న విడుదలవుతున్నాయి. మరి ఈ రెండింటిలో విజయం ఎవరిది? రెండు సినిమాల బలాలేంటనేది చూస్తే.. 
 

`ఆచార్య` వంటి డిజాస్టర్‌ తర్వాత చిరంజీవి నుంచి వస్తోన్న చిత్రం `గాడ్‌ ఫాదర్‌`. ఇది మలయాళంలో రూపొందిన `లూసీఫర్‌`కి రీమేక్‌. అక్కడ మోహన్‌లాల్‌ నటించారు. రీమేక్‌కి మోహన్‌రాజా దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్‌ కండల వీరుడు  సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్ర పోషించారు. ఆయనతోపాటు లేడీ సూపర్‌స్టార్‌ నయనతార, సత్యదేవ్‌, పూరీ జగన్నాథ్‌, మురళీ శర్మ వంటి మంచి నటులు చేసిన చిత్రమిది. థమన్‌ సంగీతం అందించారు. ఇవన్నీ సినిమాకి పెద్ద అసెట్‌. 
 

మరోవైపు `ఆచార్య` పరాజయంతో `గాడ్‌ఫాదర్‌`పై చాలా ఒత్తిడి ఉంది. చిరంజీవి ఎలాగైనా హిట్‌ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెగా ఫ్యాన్స్ కిది ప్రతిష్టాత్మకమైన విషయం కూడా. అయితే మొన్నటి వరకు ఈ సినిమాపై ఆశించిన స్థాయిలో బజ్‌ లేదు. గత సినిమా తాలూకు ఎఫెక్ట్ కావచ్చేమో ,  కానీ ట్రైలర్‌, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌తో ఒక్కసారిగా హైప్‌ తీసుకొచ్చాడు చిరు. ఆయన స్పీచ్‌ నెక్ట్స్ లెవల్‌లో ఉంది. సినిమా సక్సెస్‌కి అది  నిదర్శనమని చెప్పొచ్చు. ఈవెంట్‌లో కూడా చిరు అదే చెప్పాడు. సుమారు వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా అంతకు మించే బిజినెస్‌ చేసుకుంది. దీంతో సినిమాపై అంచనాలున్నాయి. 
 

అదే సమయంలో కొంత డ్రాబ్యాక్‌ కామెంట్లున్నాయి. `లూసీఫర్‌` ఒరిజినల్‌ సినిమానే తెలుగు ఆడియెన్స్ ఇప్పటికే చూశారు. లాక్‌డౌన్‌లో ఒకటికి రెండు సార్లు చూశారు. దీంతో `గాడ్‌ ఫాదర్‌` విడుదలయ్యాక కంపేరిజన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇదే ఇప్పుడు చిరుని బయపెడుతుంది. అదే సమయంలో పాన్‌ ఇండియా ఇమేజ్‌ కోసం సల్మాన్‌ని దించారు. కానీ మాతృకలో చేసిన పృథ్వీరాజ్‌ పాత్రతో పోల్చితే సల్మాన్‌ పాత్రకి ప్రయారిటీ పెంచినట్టు తెలుస్తుంది. అతిగా పెంచడమనేది తేడా కొడుతుందా? అనే  సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

ఎంత చిరంజీవి చేసినా రీమేక్‌ రీమేక్‌ అన్నట్టుగానే చూస్తారు. అదే సమయంలో ఇటీవల హిందీలో విడుదలైన `విక్రమ్‌వేద` తమిళం చిత్రానికి రీమేక్‌. ఆల్‌రెడీ ఆ సినిమాని జనం చూసేయడంతో ఇప్పుడు సైఫ్‌ అలీ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌ కలిసి చేసిన ఈ చిత్రానికి మంచి టాక్‌ ఉన్నా, థియేటర్లలో కలెక్షన్లలో లేవు. మరి అదే పరిస్థితి ఇప్పుడు `గాడ్‌ ఫాదర్‌` ఫేస్‌ చేయబోతుందా అనే సందేహాలున్నాయి. మరి చిరు దాన్ని అదిగమించి హిట్‌ కొడతాడా? అనేది చూడాలి. హిట్‌ కొట్టాడంటే దీంఅది సంచలనమనే చెప్పొచ్చు. 

The Ghost

ఇక నాగార్జున నటించిన `ది ఘోస్ట్` విషయానికి వస్తే ఇది ఒరిజినల్‌ మూవీ. `చందమామ కథలు`,  `పీఎస్‌వీ గరుడవేగ`వంటి  సూపర్‌ హిట్‌ చిత్రాలతో ఆకట్టుకున్న ప్రవీణ్‌ సత్తారు రూపొందించిన చిత్రమిది. యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. గత చిత్రాలతో దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు తన సత్తా చాటడంతో ఈ చిత్రంపై అంచనాలున్నాయి. పైగా ఇటీవల విడుదలైన `ది ఘోస్ట్` ట్రైలర్‌ మరింత ఆకట్టుకుంది.  పాజిటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. చాలా వరకు నాగ్‌ `కిల్లర్‌` చిత్రంతో పోల్చుతున్నారు. అది అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 
 

The Ghost

`ది ఘోస్ట్`లోనూ అలాంటి సన్నివేశాలే ఉన్నాయి. తన కోడలిని కాపాడటం కోసం రిటైర్డ్ రా ఏజెంట్‌ మళ్లీ రంగంలోకి దిగి క్రైమ్‌ సిండికేట్‌ని ఎదురించి తన కోడలిని కాపాడటం అనే కథాంశంతో ఈ చిత్రం  రూపొందినట్టుగా తెలుస్తుంది. ట్రైలర్‌ చూడ్డానికి హాలీవుడ్‌ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. క్లాస్‌ లుక్‌ అనేది సినిమాపై పాజిటివ్‌ బజ్‌ పెంచింది. పైగా దర్శకుడు  ప్రవీణ్‌ సత్తారు రాజశేఖర్‌ వంటి హీరోతోనే `గరుడవేగ` చేసి హిట్‌ కొట్టాడు. ఇప్పుడు నాగ్‌ కోసం ఆయన ప్రత్యేకంగా ఈ స్టోరీని డిజైన్‌ చేశారు. చాలా కేర్‌ తీసుకున్నారు. దీంతో `ది ఘోస్ట్` సత్తా చాటడం ఖాయమంటున్నారు  నాగ్‌ ఫ్యాన్స్. మరి ఈ రెండింటిలో దసరా విన్నర్స్ ఎవరనేది మరో రెండు రోజుల్లో తేలనుంది.

click me!