అప్పుడు దేవి అక్కడికి రాగానే దేవుడమ్మ, మీ అమ్మని తీసుకొని వస్తా అన్నావు ఏది అని అడగగా, అమ్మ కనిపించడం లేదు అని చెప్తుంది. ఎందుకు మీ అమ్మ నాకే కనిపించడం లేదు అని దేవుడమ్మ అనుకుంటుంది.ఇంతలో చిన్మయి,ఆదిత్యలు అక్కడికి వస్తారు. అప్పుడు మాధవ్, రాదేవి ఇంటికి వెళ్దాము అని చిన్మయిని దేవిని తీసుకొని బయలుదేరుతారు. మరోవైపు రాధ గుడికి అవతల వైపు కూర్చొని ఏడుచుకుంటూ జరిగిన విషయాన్ని గుర్తుతెచ్చుకొని, సత్యేనా నాతో అలా మాట్లాడింది. నేను ఎందుకు సత్యకి హాని చేయాలని చూస్తాను తన కోసమే కదా నా జీవితాన్ని కూడా వద్దనుకొని ఇప్పుడు ఇలా బతుకుతున్నాను అని అంటుంది.