విడాకులు తీసుకోవడం నాకు నచ్చదు.. పెళ్లి చేసుకోవడంపై త్రిష షాకింగ్ కామెంట్స్

Published : Oct 10, 2022, 12:33 PM IST

39 ఏళ్ల వయసులో కూడా త్రిషకి అద్భుతమైన ఆఫర్స్ వస్తున్నాయి. లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వం చిత్రంలో త్రిష నటించింది. 

PREV
16
విడాకులు తీసుకోవడం నాకు నచ్చదు.. పెళ్లి చేసుకోవడంపై త్రిష షాకింగ్ కామెంట్స్

తెలుగులో వర్షం చిత్రంతో త్రిష హవా మొదలైంది. స్టార్ హీరోలందరితో ఆడి పాడింది. తన అందం, చిలిపితనంతో త్రిష చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా త్రిష విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. 

 

26

39 ఏళ్ల వయసులో కూడా త్రిషకి అద్భుతమైన ఆఫర్స్ వస్తున్నాయి. లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వం చిత్రంలో త్రిష నటించింది. పొన్నియన్ సెల్వం ప్రమోషన్స్ లో త్రిష చాలా అందంగా కనిపించింది. 20 ఏళ్ల కుర్రభామలా త్రిష అందంగా కనిపించింది. 

 

36

కానీ ఆమె అసలు వయసు అంతకు దాదాపు రెండింతలు.. అంటే 39 ఏళ్ళు. దీనితో మరోసారి ఆమె వయసు, పెళ్లి వ్యవహారాలు అభిమానుల మధ్య చర్చకు వచ్చాయి. ఇంటర్వ్యూలలో కూడా ఆమెని పెళ్లి గురించి ప్రశ్నలు అడిగారు. ఇన్నేళ్ళైనా త్రిష ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ప్రశ్నించారు. 

 

46

దీనికి త్రిష ఆసక్తికర సమాధానం ఇచ్చింది. త్రిష ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడగడం కరెక్ట్ కాదు. త్రిష ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది అని అడిగితేనే సమాధానం ఇస్తాను. అది కూడా నా వ్యక్తిగతమే. నానా వివాహం ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే నాతో జీవితాంతం ఉండగలిగే వ్యక్తి దొరకాలి. 

 

56

నాచుట్టూ ఉన్న చాలా మంది వివాహం చేసుకుని సంతృప్తిగా లేరు. వివాహం చేసుకుని విడాకులు తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. మధ్యలో ముగిసిపోయే బంధాలు నాకు వద్దు. అందుకే నా వివాహం ఆలస్యం అవుతోంది అని త్రిష పేర్కొంది. 

 

66

కొన్నేళ్ల క్రితం త్రిషకి ఓ వ్యాపార వేత్తతో నిశ్చితార్థం జరిగింది. కానీ వారిద్దరూ పెళ్లి వరకు వెళ్లకుండానే విడిపోయారు. ఆ ప్రభావం త్రిషపై బాగా పడినట్లు ఉంది. ఈసారి తన లైఫ్ లోకి వచ్చేవాడు అర్థం చేసుకునే వాడు అయి ఉండాలని భావిస్తోందో ఏమో. అందుకే ఇంకా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. 

 

Read more Photos on
click me!

Recommended Stories