తమ్ముడు నిజమైన ప్రేమ పొందుతున్నాడు.. మంచు మనోజ్‌ రెండో పెళ్లిపై ఆసక్తికర విషయాలు బయటపెట్టిన మంచు లక్ష్మి

Published : Oct 10, 2022, 12:30 PM IST

మంచు మనోజ్‌ రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఇటీవల గుప్పుమన్నాయి. ఆయన భూమా మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలొస్తున్నాయి. తాజాగా దీనిపై అక్క మంచు లక్ష్మి స్పందించింది. 

PREV
15
తమ్ముడు నిజమైన ప్రేమ పొందుతున్నాడు.. మంచు మనోజ్‌ రెండో పెళ్లిపై ఆసక్తికర విషయాలు బయటపెట్టిన మంచు లక్ష్మి

మంచు మనోజ్‌ మొదటి భార్య ప్రణతకి విడాకులిచ్చాక ఒంటరిగానే ఉంటున్నారు. ఆయన అటు సినిమాలు కూడా చేయడం లేదు. చాలా రోజులు ఆయన బయట కనిపించడం లేదు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఇటీవల వినాయక చవితి పండుగ సందర్భంగా బయటకొచ్చారు. ఫ్రెండ్ పిలుపు మేరకు వినాయకుడి పూజలో పాల్గొన్నారు. 

25

అయితే మంచు మనోజ్‌ ఏకంగా జంటగా ఈ పూజలో పాల్గొనడం విశేషం. మాజీ మంత్రి భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికారెడ్డితో కలిసి వచ్చారు. అందరిని ఆశ్చర్యపరిచారు. దీంతో ప్రస్తుతం వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ కొన్ని వార్తలు బయటకొచ్చాయి. గత కొంత కాలంగా మంచు మనోజ్‌, మౌనికారెడ్డి కలిసే ఉంటున్నారని వార్తలు గుప్పుమన్నాయి. 
 

35

ఈ జంట రెండో పెళ్లికి సంబంధించి సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా అక్క మంచు లక్ష్మి స్పందించింది. ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఎవరి బతుకు వారిని బతకనివ్వండి అని వెల్లడించింది. దీంతో మంచు మనోజ్‌, మౌనిక ప్రేమలో ఉన్నారని, వారు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలకు బలాన్నిచ్చింది. అంతేకాదు ఇంకా ఆసక్తికర కామెంట్ చేసింది మంచు లక్ష్మి. 
 

45

మనోజ్‌ మళ్లీ పెళ్లి చేసుకుంటే తనకు సంతోషమే అని, ఈ రోజులు నిజాయితీ గల ప్రేమని పొందడం చాలా కష్టమని, ఇప్పుడు మనోజ్‌ అలాంటి ప్రేమనే పొందుతున్నాడని చెప్పింది. ఆ విషయంలో తాను హ్యాపీగా ఉన్నానని, తన ఆశీర్వాదం మనోజ్‌కి ఎప్పుడూ ఉంటుందని చెప్పింది మంచు లక్ష్మి. దీంతో మనోజ్‌ రెండో పెళ్లికి లైన్‌ క్లీయరే అని, త్వరలోనే మ్యారేజ్‌ కి సంబంధించిన గుడ్‌ న్యూస్‌ రావచ్చనే ఊహగానాలు ఊపందుకున్నాయి. 
 

55

మంచు మనోజ్‌, భూమా మౌనికా రెడ్డిలు వారి మొదటి పెళ్లిళ్లకి ముందు నుంచే పరిచయం అని, ఇద్దరి మధ్య, వారి రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉందని, కానీ పెద్దల కారణంగా వారి మ్యారేజ్‌ అప్పుడు జరగలేదని, ఇప్పుడు ఏ అడ్డంకి లేకపోవడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం మంచు మనోజ్‌ ఇంట్లోనే మౌనికా రెడ్డి ఉంటున్నారని, ఇద్దరూ సహజీవనంలో ఉన్నారని సమాచారం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories