అప్పుడు మాధవ్ చిన్న పిల్లల్ని అలాంటి ప్రదేశానికి తీసుకెళ్తే బాధపడతారు కదా అని అనగా దేవి, నేనేం బాధపడట్లేదు నాయనా నేను చాలా సంతోషంగా ఉన్నాను కదా నాకు ఇంకా నాయన లేకపోయినా పర్వాలేదు అని అంటుంది. అప్పుడు రుక్మిణి, దేవమ్మకి నేను ఆఫీసర్ సారు ఉన్నంతవరకు ఏమీ అవ్వదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మాధవ్, ఇలా ఉంటే ఇంక నన్ను రాధ పెళ్లి చేసుకోదు కనుక ఇంకో కొత్త ప్లాన్ వేసి దేవిని నా అదుపులోకి తెచ్చుకోవాలి అని అనుకుంటాడు.తర్వాత సీన్ లో ఆదిత్య తన ఇంట్లో బాధపడుతూ ప్రస్తుతానికి అయితే దేవిని ఆపగలిగాను.