ఇంత సంస్కారమైన కోడలు దొరకడం మీ అదృష్టం, భార్యగా దొరకడం మాధవ సార్ అదృష్టం అని అంటారు.అప్పుడు మాధవ్,ఇంటికి పద అని రుక్మిణి తో అంటాడు. అందరి మధ్య ఉన్నది కనుక రుక్మిణి కుదరదు అని చెప్పలేదు. అప్పుడు భాగ్యమ్మ, నేను వస్తాను అని అనగా మాధవ్ కోపంగా చూస్తూ మేమిద్దరం వెళ్తాము అని రాధ నీ తీసుకెళ్లిపోతాడు. ఆ తర్వాత సీన్లో దేవి ఇంట్లో వాళ్ళందరికీ ప్రసాదం పంచుతూ అందర్నీ వరుసలు పెట్టి పిలుస్తుంది. అప్పుడు వాళ్ళందరికీ రుక్మినీ గుర్తొస్తుంది.