ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... జగతి,మహేంద్రా, గౌతమ్ ముగ్గురు దేవయానిలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది? అని ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంకేమైనా ప్లాన్ వేశారా? అని జగతి అంటుండగా వసుధార, రిషి ఇద్దరు సరిగ్గా ఉన్నప్పుడు ఇంకా దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని అంటాడు. మహేంద్ర, అయినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఎవరు ఫోన్ ఎత్తట్లేదు? అని అనుకుంటారు. తర్వాత సీన్లో రిషి, వసుధార రాత్రిపూట చలిమంట పెట్టుకొని కూర్చుంటారు. అప్పుడు రిషి, వసుధారతో నేను నిన్ను ఒక విషయం అడుగుతాను అని అంటాడు.