కల్యాణ్ రామ్ హీరోగా, కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా కొత్త దర్శకుడు శ్రీవశిష్ఠ్ డైరెక్షన్ లో బింబిసార సినిమా తెరకెక్కింది. దాదాపు 40 కోట్ల బడ్జెట్‌తో చారిత్రక నేపథ్యాన్ని కథగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. క్రీ.పూ. 5వ శతాబ్దానికి చెందిన మగధ సామ్రాజ్యాధిపతి, గౌతమ బుద్ధుడి సమకాలీడైన బింబిసార జీవిత కథ ను.. టైమ్ ట్రావెలింగ్ పాయింట్‌తో జత చేసి ఈ సినిమాను నిర్మించారు.