2002లో నీతోడుకావాలని సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ బ్యూటీ ఛార్మీ. అయితే ఈ సినిమా అంత హిట్ అవ్వలేదు కాని.. ఛార్మి మాత్రం టాలీవుడ్ లో పాతుకుపోయింది. ఆతరువాత వరుసగా మంత్ర, పౌర్ణమి, చక్రం, శ్రీఆంజనేయం, మాస్, చిన్న లాంటి సినిమాలతో ఛార్మికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరవాత తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేసింది బ్యూటి.