Guppedantha Manasu: జగతి మహేంద్రపై సీరియస్ అయిన దేవయాని.. వసుని తలచుకొని బాధపడుతున్న రిషి?

First Published Jan 30, 2023, 7:38 AM IST

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 30 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో రిషి ఒకచోట కూర్చొని వసుధార అన్న మాటలు తలుచుకొని అసలు ఏమీ జరగనట్టు ఎలా మాట్లాడుతున్నావు వసుధార నువ్వు నన్ను ఏమీ అనలేదా అని మర్చిపోయావా అనుకుంటూ ఉంటాడు. నువ్వు ఇలాంటి పరిస్థితి తెస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు చేస్తున్నది తప్పు అని నీకు ఎప్పుడూ అనిపించలేదా, అన్ని మాట్లాడావు నాతో అన్ని మాటలు చెప్పావు. అన్ని జ్ఞాపకాలను అందించి చివరికి నీ ఇష్టం అన్నావు అంటూ తనలో తానే మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటాడు. నువ్వు నిజంగానే నన్ను ప్రేమించలేదా అదంతా ఒట్టి నాటకమా నాతో ఇన్ని మాటలు అనిపిస్తున్నావు కదా ఇదంతా నీ వల్లే కదా అనుకుంటూ వసుధారతో గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటాడు రిషి. నేను నువ్వు ఇచ్చిన జ్ఞాపకాలను తలుచుకొని కుమిలిపోవాలా, జ్ఞాపకాలను మర్చిపోగలనా మర్చిపోయే శక్తి నాకు ఉందా అనుకుంటూ ఉంటాడు రిషి.
 

 మరొకవైపు జగతి, మహేంద్ర చక్రపాణి గురించి మాట్లాడుకుంటూ ఆయన వచ్చినప్పుడు ఆయన మాట వినాల్సింది జగతి అనవసరంగా వెనక్కి పంపించేశాము అనడంతో ఆయనను చూడగానే నాకు కోపం వచ్చింది మహేంద్ర. దేవయాని అక్కయ్య చూసి ఉంటే పెద్ద గొడవ జరిగేది అందుకే ఆ టెన్షన్లు పంపించేసాము అంటుంది జగతి. ఇంతలోనే అక్కడికి దేవయాని చప్పట్లు కొడుతూ వస్తుంది. వదిన గారు మా మాటలు చాటుగా వింటున్నారా అనగా అప్పుడు జగతి ఇంకా అలవాటు మానుకోలేదా అక్కయ్య అనడంతో మీరు మాట్లాడుతూ మీరే తప్పు చేస్తున్నారు వినడంలో నాది ఏం తప్పులేదు అంటుంది. నేను వివరాలు అన్ని అడిగి తెలుసుకుంటానని వెనక్కి పంపించేసారా అసలు మీకు సిగ్గు ఉందా? ఇవి జరగడానికి మొత్తం కారణం మీరే అంటూ మహేంద్ర వాళ్ళ పై సీరియస్ అవుతుంది దేవయాని.
 

 సాక్షిని ఇచ్చి పెళ్లి చేస్తాము అంటే అడ్డుపడ్డారు వసుధారని పీల్చుకుని వచ్చి రిషి రెచ్చగొట్టి పెళ్లి చేసుకుని ఇలా చేశారు కానీ ఆ వసుధార మీపైనే తిరగబడింది అనడంతో కొంచెం మర్యాదగా మాట్లాడండి అక్కయ్య అంటుంది జగతి. రిషిని చిన్న చిన్నప్పటినుంచి పెంచింది పెద్ద చేసింది నేను రిషి గురించి ఆలోచించేది నేను నువ్వు మధ్యలోనే వచ్చావు అలాగే ఉండు అని అంటుంది. అసలు రిషి ఎక్కడున్నాడో ఏమయ్యాడో మీకేం పట్టడం లేదా ఇద్దరు జంటగా చేతులు పట్టుకొని తిరుగుతుంటారు అంటూ నోటికొచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటుంది దేవయాని. ఎంతసేపు వీరిద్దరూ కలిసి ముచ్చట్లు పెట్టుకోవడమే ఉందా లేకపోతే రిషి ఏమైనా పిలుచుకుని వస్తారా లేదా అని నిలదీస్తుంది దేవయాని.
 

 వదిన రిషి అక్కడ ఉండడమే కరెక్ట్ అని అనడంతో రిషి ని ఇక్కడికి ఎలా రప్పించాలో నాకు తెలుసు రిషి ని రప్పిస్తాను అని రిషికి ఫోన్ చేయగా రిషి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చూసారా నా ఫోన్ కూడా రిషి లిప్ చేయని పరిస్థితి తీసుకోవచ్చారు అంటుంది దేవయాని. రిషి దగ్గరికి వెళ్తాను రిషికి నచ్చచెప్పో బతిమాలో ఇంటికి పిలుచుకొని వస్తాను. అని అక్కడి నుంచి వెళుతూ తీసిన అడ్డుపెట్టుకొని ఏమేమి చేయాలో అన్ని చేస్తాను అనుకుంటూ ఉంటుంది. అప్పుడు దేవయాని రిషి దగ్గరికి బయలుదేరగా మహేంద్ర,జగతి కూడా అక్కడికి బయలుదేరుతారు. మరొకవైపు వసుధార, చక్రపాణికి భోజనం వడ్డిస్తూ ఉండగా అది చూసి చక్రపాణి సంతోషపడుతూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి దేవయాని వస్తుంది. ఏంటి వసు నేను వస్తానని ఊహించుకోలేదా అని అనగా అప్పుడు దేవయాని చక్రపానికి నేను వసుధార వాళ్ళ పెద్దమ్మ ని అనడంతో లేచి దండం పెడతాడు.
 

 అప్పుడు వసుధర రిషి ఎక్కడ అనగా ఇక్కడికి ఎందుకు వస్తారు మేడం అని అనడంతో నీ దగ్గరే ఉంటారు కదా అంటుంది. అప్పుడు దేవయాని నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉండగా వసుధార దేవయానికి రివర్స్ లో కౌంటర్లు ఇస్తూ మాట్లాడుతుంది. స్ట్రైట్ గా పాయింట్ కి వస్తాను నువ్వు ఏం చేశావు ఎందుకు చేసావు నీకు మాత్రమే తెలుసు. కానీ మళ్ళీ ఎందుకు వెనక్కి వచ్చావో అది అంతు పట్టడం లేదు అన్నగా రిషి సార్ కు నాకు అర్థం అయితే చాలు మేడం అని అంటుంది బస్సు ద్వారా. అప్పుడు దేవయాని వసుధారకి బ్లాక్ చెక్ ఇచ్చి ఇందులో ఎంతైనా రాసుకొని ఏ ఊరు నుంచి విడిచి వెళ్ళిపో అని అంటుంది. అప్పుడు వసు చక్రపాణి లోపలికి వెళ్ళమని చెబుతుంది. అప్పుడు మీరు వచ్చిన దారినే వెళ్లిపోండి మేడం మర్యాదగా చెబుతున్నాను అనడంతో ఇందులో ఎంతైనా రాసుకో అని చెక్ బుక్ ఇస్తుండగా తీసుకోదు. 
 

ఇంతలో చక్రపాణి పిలవడంతో అక్కడికి వెళుతుంది వసుధర. మరొకవైపు జగతి,మహేంద్ర రిషి ఉన్న చోటికి వెళ్గా దేవయాని లేకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటారు. మరోవైపు వసుధార  చక్రపాణి దగ్గరికి వెళ్లి ఎవరు వచ్చిన ఏం చేసినా మీ టెన్షన్ పడకండి అని ధైర్యం చెపుతుంది . ఆ తర్వాత మహేంద్ర కు ఫోన్ చేయగా ఇంతలో రిషి వచ్చి ఆ ఫోన్ తీసుకుంటాడు. హలో మహేంద్ర సార్ ఇక్కడికి రండి సార్ దేవయాని మేడం గొడవ చేస్తుంది అనడంతో మహేంద్ర వాళ్ళను అక్కడే ఉండమని చెప్పి రిషి అక్కడి నుంచి బయలుదేరుతాడు. మరోవైపు దేవయాని వసుధారని ఊడి విడిచి వెళ్ళమని చెప్పగా మీరు చెప్తే నేను వెళ్ళను మేడం అని అంటుంది.

click me!