సోదరుడి పెళ్లిలో పూజా హెగ్దే హంగామా.. ఎప్పుడూ లేనంత సంతోషం.. బుట్టబొమ్మ ఎమోషనల్‌ నోట్‌..

Published : Jan 30, 2023, 07:13 AM IST

పూజాహెగ్డే గత వారం రోజులుగా పెళ్లివేడుకలో బిజీగా ఉంది. ఎప్పుడూ లేనంత హ్యాపీనెస్ ని పొందుతుంది. వెడ్డింగ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

PREV
17
సోదరుడి పెళ్లిలో పూజా హెగ్దే హంగామా.. ఎప్పుడూ లేనంత సంతోషం.. బుట్టబొమ్మ ఎమోషనల్‌ నోట్‌..

బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) సోదరుడు(అన్న) రిషబ్‌ హెగ్డే పెళ్లి ఇటీవల గ్రాండ్‌గా జరిగింది. శివానీశెట్టి అనే అమ్మాయిని  రిషబ్‌ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి సంబంధించి అన్నీ తానై చూసుకుంది పూజా.సొంత బ్రదర్‌ కావడంతో ఓ రకంగా పెద్దగా వ్యవహరించిందని చెప్పొచ్చు. వారం రోజులపాటు ఆ పెళ్లి వేడుకులో మునిగి తేలింది. 
 

27

ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటూ పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేసింది. ఇందులో ఓ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది. ఇన్నాళ్లు ఎప్పుడూ లేనంత సంతోషాన్ని ఈ పెళ్లితో పొందానంటూ ఎమోషనల్‌ అయ్యింది. ఆనందంతో కూడిన కన్నీళ్లు వచ్చాయని చెప్పింది. 
 

37

`నా సోదరుడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి వేడుక ప్రారంభం నుంచి నేను ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నా. చిన్నపిల్లలా నవ్వేశా. ఆనందభాష్పాలు వచ్చాయి. అన్నా మీరు మీ జీవితంలో తదుపరి దశలోకి అడుగుపెడుతున్నప్పుడు అనియంత్రితంగా ప్రేమిస్తారని, నిండు హృదయాన్ని అందిస్తారని, శాంతి, అవగాహనతో ముందుకు సాగుతారని నేను కోరుకుంటున్నా` అంటూ ఎమోషనల్‌ అయ్యింది పూజా.
 

47

ఈ సందర్భంగా వధువు శివానీ ఫ్యామిలీకి స్వాగతం పలికింది పూజా హెగ్డే. `శివానీ మీరు అందమైన, అద్బుతమైన వధువు, మీ కుటుంబానికి స్వాగతం` అంటూ పేర్కొంది బుట్టబొమ్మ. ఈ సందర్భంగా ఆమె షేర్‌ చేసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 
 

57

ఇందులో పూజా హెగ్డే ఎర్రని పట్టుశారీలో మెరిసింది. ఇంకా చెప్పాలంటే పెళ్లిలో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అందరి చూపులు తనవైపు తిప్పుకుంది. చీరలో ఎంతో అందంగా ఉంది పూజా. చూడబోతుంటే తనకి కూడా పెళ్లి కళ వచ్చిందనే ఫీలింగ్‌ని నెటిజన్లు వ్యక్తం చేస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే ఆ మధ్య సల్మాన్‌ తో ప్రేమలో పడిందనే పుకార్లు బయటకు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని సల్మాన్‌ సన్నిహిత వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. పూజా ఆయనకు కూతురు లాంటిది అని కూడా చెప్పడం విశేషం. 
 

67

పూజా హెగ్డే కెరీర్‌ పరంగా కాస్త జోరు తగ్గింది. ఆమె రెండేళ్ల క్రితం వరకు జోరుమీదుంది. ఆమె పట్టిందల్లా బంగారమే అన్నట్టు చేసిన ప్రతి సినిమా హిట్‌ అయ్యాయి. కానీ గతేడాది గట్టిగా దెబ్బపడింది. లాస్ట్ ఇయర్‌ వచ్చిన అన్ని సినిమాలు పరాజయంచెందాయి. `రాధేశ్యామ్‌`, `ఆచార్య`, `బీస్ట్`, హిందీలో `సర్కస్` సినిమా సైతం బోల్తా కొట్టింది. దీంతో ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తుంది. 

77

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో మహేష్‌బాబుతో త్రివిక్రమ్‌ సినిమాలో నటిస్తుంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనబోతుంది. మరోవైపు పవన్‌-హరీష్‌ శంకర్‌ మూవీ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చిత్రంలో నటించాల్సి ఉంది. హిందీలో సల్మాన్‌ తో `కిసి కా భాయ్‌ కిసి కీ జాన్‌` చిత్రంలో నటిస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories