కంగారులో ఏమి మాట్లాడలేక పోతారు తల్లి కొడుకులు. మీరు ఏమి మాట్లాడకపోయినా నీ బుద్ధి, మీ ప్లాన్స్ నాకు తెలుసు అంటుంది వసుధార. తెలిస్తే ఏం చేస్తావ్ అంటాడు శైలేంద్ర. ఇకనుంచి మీ మీద నిఘా పెడతాను, జగతి మేడం చేసిన ప్రాణ త్యాగాన్ని వృధా పోనివ్వను అంటుంది వసుధార.నువ్వు చేసిన చాలెంజ్ కి భయపడి పోవాలా అని నవ్వుతాడు శైలేంద్ర.