రాజా వారు రాణి గారు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం మెప్పించాడు. ఎస్ ఆర్ కల్యాణమండపం హిట్ టాక్ తెచ్చుకోగా కిరణ్ వెలుగులోకి వచ్చాడు. యూత్ లో ఓ మోస్తరు ఇమేజ్ తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం మాస్ హీరో అయ్యే ప్రయత్నాలు కూడా చేశాడు. ఆయన గత చిత్రం మీటర్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. అయితే ఫలితం మాత్రం దక్కలేదు.
దీంతో పంథా మార్చి రొమాంటిక్ కామెడీ జోనర్ ఎంచుకున్నాడు. ఆయన లేటెస్ట్ మూవీ కామెడీ ప్రధానంగా తెరకెక్కింది. ఈ విషయాన్ని కిరణ్ అబ్బవరం పదే పదే చెబుతున్నారు. తన గత చిత్రాల్లో మాదిరి ఫైట్స్, యాక్షన్ ఎక్సపెక్ట్ చెయ్యొద్దని బహుశా ఆయన ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం కావొచ్చు.
కిరణ్ చెప్పినట్లే రూల్స్ రంజన్ ఫన్ రైడ్ అని తెలుస్తుంది. సినిమాలో చెప్పుకోదగ్గ కథ ఉండదు. కామెడీ సన్నివేశాలు, డైలాగ్స్, వన్ లైనర్స్ తో సాగుతుందని ప్రేక్షకుల అభిప్రాయం. కొంత మంది ఆడియన్స్ కి ఫస్ట్ హాఫ్ నచ్చింది. సెకండ్ హాఫ్ పర్లేదు అంటున్నారు. కొందరు ఆడియన్స్ దీనికి రివర్స్ చెబుతున్నారు.
రూల్స్ రంజన్ డీసెంట్ మూవీ. కామెడీ చిత్రాలు ఇష్టపడే వారు బాగా ఎంజాయ్ చేస్తారని ట్విట్టర్ టాక్. సినిమాలో కథ లేదు, ఎమోషన్ లేదు అనేవి పక్కన పెట్టి ఎంజాయ్ చేయడమే. అంచనాలు పెట్టుకొని వెళితే రూల్స్ రంజన్ మెప్పించకపోవచ్చు. జస్ట్ వీకెండ్ పార్టీలో భాగం అనుకుని థియేటర్స్ లో గడపడమే అంటున్నారు.
కిరణ్ అబ్బవరం యాక్టింగ్ కి పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. రూల్స్ రంజన్ గా ఆయన లుక్, కామెడీ టైమింగ్ బాగుందని టాక్. ఇక నేహా శెట్టి కూడా గుడ్. సమ్మోహనుడా సాంగ్ సినిమాకు ప్లస్ అయ్యిందన్న మాట వినిపిస్తోంది.
Rules Ranjan
రూల్స్ రంజన్ మూవీలో భారీ తారాగణం నటించారు. వెన్నెల కిషోర్, హైపర్ ఆది, సుదర్శన్, అజయ్, సుబ్బరాజ్ ఇలా స్టార్ క్యాస్ట్ ఉంది. వెన్నెల కిషోర్ కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యిందని అంటున్నారు. హైపర్ ఆది, హర్ష, సుదర్శన్ లతో కాంబినేషన్ సీన్స్ బాగున్నాయని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
దర్శకుడు రాతిన కృష్ణ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అయితే అక్కడక్కడా మూవీ బోరింగ్ గా సాగుతుందని ప్రేక్షకుల అభిప్రాయం. మొత్తంగా రూల్స్ రంజన్ డీసెంట్ మూవీ. కామెడీ చాలా వరకు వర్క్ అవుట్ అయ్యింది. అంచనాలు లేకుండా వెళితే నచ్చుతుంది...