ఈరోజు ఎపిసోడ్ లో వసుధార, రిషి ఇద్దరు పడవలు నీటిలో వదిలి మనసులో కోరికలు కోరుకొని కళ్ళు తెరిచి చూడగా అప్పుడు రెండు పడవలు ఒక చోట కలుసుకోవడంతో అది చూసి ఇద్దరు ఆశ్చర్యపోతారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు వాళ్లు ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా అది చక్రపాణి, మహేంద్ర,జగతి వాళ్ళు చూసి షాక్ అవుతారు. అప్పుడు రిషి ఈ పొగరు ఏంటి ఇక్కడికి వచ్చింది అయినా ఆ పేపర్లో ఏం రాసి ఉంటుంది అనుకుంటూ ఉంటాడు రిషి. అప్పుడు వసుధార కూడా పడవలు వదలడానికి ఇక్కడికి వచ్చాడా రిషి సార్ ఏం కోరుకొని ఉంటాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది.