రెండో సినిమాకే రేటు పెంచిన జాన్వీ కపూర్, రామ్ చరణ్ మూవీకి ఎంత డిమాండ్ చేసిందంటే..?

First Published | Sep 21, 2024, 9:59 PM IST

టాలీవుడ్ లో అడుగు పెట్టడంతోనే వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కు. ఇక ఆమె కూడా ఇదే అదనుగా రెమ్యునరేషన్ గట్టిగా డిమాండ్ చేస్తుందట. 
 

బాలీవుడ్ లో పెద్దగా డిమాండ్ లేదు జాన్వీ కపూర్ కు. టాలీవుడ్ జనాలు మాత్రమే ఆమెను శ్రీదేవి కూతురుగా కాస్త గుర్తిస్తున్నారు. బాలీవుడ్ లో జాన్వీకపూర్ కు ఇంత వరకూ సాలిడ్ హిట్ లేదు. జాన్వీ కూడా తన తల్లి శ్రీదేవి కోరిక మేరకు మాత్రమే సౌత్ సినిమాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 

Also Read: జానీ మాస్టర్ ఒక్క పాటకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడో తెలుసా..?

కాని జాన్వీ కపూర్ మాత్రం తెలుగులో నటిస్తూ.. కాస్త పొగరు చూపిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. తానేదో దేవ కన్యలాగా.. అతిలోక సుందరిగా ఫీల్ అవుతుందేమో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతే కాదు ఆమె రెమ్యూనరేషన్ విషయంలో కూడా  ఆమె నిర్మాతలకు షాక్ ఇస్తుందట. 

జాన్వీ కపూర్ ఎన్టీఆర్ జోడీగా దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈమూవీ ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈసినిమా ద్వారా పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది జాన్వీ కపూర్. అంతకు ముందు వరకూ ఆమె బాలీవుడ్ కు మాత్రమే పరిమితం అయ్యింది. 

Also Read: అభయ్ నవీన్ ఎలిమినేటెడ్.. నోటి దూల కొంపముంచిందా..?


బాలీవుడ్ లో ఆర్ట్ మూవీస్ చేస్తున్న జాన్వీ.. తెలుగు సినిమాతోనే కమర్షియల్ హీరోయిన్ గా గుర్తింపు సాధించబోతోంది. అంతే కాదు బాలీవుడ్ లో సినిమాలకు ఆమెకు రెండు కోట్లకు మించి రెమ్యూనరేషనర్ ఇవ్వడంలేదు అని తెలుస్తోంది. కాని దేవర సినిమాకు ఆమె 4 కోట్లు తీసుకుందట. 

పాన్ ఇండియా ఇమేజ్ తో పాటు.. డబుల్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న జాన్వీ కపూర్ కు దేవర సినిమా హిట్ అయితే టాలీవుడ్ చాలా మేలు చేసినట్టే అవుతుంది. ఇప్పటికే ఈసినిమా రిలీజ్ అవ్వకముందు టాలీవుడ్ నుంచి మంచి మంచి అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. 

Also Read:  శోభన్ బాబు అత్తా అని పిలిచే హీరోయిన్ ఎవరో తెలుసా..?

కాని జాన్వీ కపూర్ తన పొగరుతో నిర్మాతలను బెదరగొడుతుంది అని టాక్ వినిపిస్తుందతి. ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని జాన్వీ తన రెమ్యూనరేషన్ ను అమాంతం పెంచేసిందట. దేవర సినిమా రిలీజ్ కాకముందు ఆమెకు రామ్ చరణ్ సినిమాలో అవకాశం వచ్చింది. 

బుచ్చిబాబు డైరెక్షన్ లో రాబోతున్న ఈసినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతోంది. అయితే ఈసినిమాకోసం జాన్వీ కపూర్ 10 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఆహె 8 కోట్ల వరకూ అడిగిందని మరో వాదన కూడా ఉంది. 

Also Read: దర్జాగా బతికిన భానుమతి.. చివరి రోజుల్లో అంత హింస అనుభవించిందా..?

బాలీవుడ్ లో రెండు కోట్లకు మించి సంపాదించలేని ఆమె.. టాలీవుడ్ ను డిమాండ్ చేసి మరీ.. ఇంత అడగడమేంటి అని విమర్శలు వస్తున్నాయి. అంతే కాదు.. ఇలా పెంచడం వల్ల ఆమెకు వచ్చే అవకాశాలు కూడా పోతాయి...కెరీర్ కు పెద్ద దెబ్బ పడుతుందని అంటున్నారు. 

రీసెంట్ గా దసరా సినిమా దర్శకుడితో నాని మరో సినిమా చేయబోతున్నారట. ఈసినిమాలో జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా అడిగారట మేకర్స్. అయితే ఆమె చెప్పిన రెమ్యునరేషన్ రేటు విని.. వారి బుర్ర తిరిగిపోయిందట. దాంతో అంత ఇచ్చుకోలేము అని వారు వెనుదిరిగినట్టు తెలుస్తోంది. 

Also Read: బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియదు కాని.. జాన్వీ కపూర్ నిజంగా ఇలానే ప్రవర్తిస్తే మాత్రం.. టాలీవుడ్ లో ఎక్కవకాలం ఉండలేదేమో అనిపిస్తుంది. అంతెందుకు దేవర సినిమాలో ఆమె పెర్పామెన్స్.. సినిమా సక్సెస్ ను బట్టి జన్వీ కపూర్ ఫ్యూచర్ సౌత్ లో ఎలా ఉంటుందో తెల్చేయవచ్చు. 

ఆమధ్య గట్టిగా ఊపు ఊపేసిన పూజా హెగ్డే పరిస్థితి ఇప్పుడు ఏంటో అందరూ చూస్తునే ఉన్నారు. ఇక శ్రీదేవి కూతురు అన్న ట్యాగ్ తో ఏదైనే చేయవచ్చు.. నడుస్తుంది అనుకుంటే మాత్రం జాన్వీకి పూజాకు పట్టిన పరిస్థితే వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి చూడాలి జన్వీ కపూర్ తెలివిగా ఆలోచిస్తుందా..? పొగరుగా ప్రవర్తిస్తుందా అనేది. 

Also Read: 

Latest Videos

click me!