శుక్రవారం సెప్టెంబర్ 21 బిగ్ బాస్ థర్డ్ వీక్ నామినేషన్స్ కు సంబంధించి ఆన్ లైన్ ఓటింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. గత రెండు వారాల్లాగే మూడో వారం ఓటింగ్ లోనూ ఓటింగ్‌లోనూ విష్ణుప్రియ భీమనేనిదే ఆధిపత్యం. ఆ తర్వాత ఎమోషనల్ స్టార్ నాగ మణికంఠ రెండో స్థానంలో ఉన్నాడు.
ఇక నైనిక మూడో స్థానంలో ఉండగా.. డేంజర్ జోన్ లో ఉన్న కిర్రాక్ సీత అనూహ్యంగా నాలుగో ప్లేస్ లోకి వచ్చింది. ప్రేరణ ఐదో స్థానంలో ఉండగా.. ఊహించలేని విధంగా యష్మీ గౌడ ఆరో స్థానంలోకి వచ్చేసింది. ఇక అభయ్ నవీన్, పృథ్వీరాజ్ ఆఖరి ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. యష్మీ, పృథ్వీరాజ్, అభయ్ నవీన్ డేంజర్ జోన్ లో ఉండగా.. అభయ్ హౌస్ నుంచి వెళ్ళిపోయాడు.