మళ్లీ 'ప్రకాష్ రాజ్ Vs మంచు విష్ణు' వయా పవన్ కళ్యాణ్

First Published | Sep 21, 2024, 8:12 PM IST

నాలాంటి కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక. ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) ఈ వ్యవహారంపై ..


తిరుమల లడ్డూ మహా ప్రసాదం (Tirupati laddu) కల్తీ జరిగిందన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా భక్తులు, ధార్మిక సంస్థలు మండిపడుతున్న సంగతి తెలిసిందే.

పవిత్రమైన తిరుపతి లడ్డూ తయారు చేసే నెయ్యిలో జంతువు నూనె, కొవ్వు ఉపయోగించారంటూ సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ పై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. సత్వర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 


ఈ క్రమంలోనే లడ్డూ కల్తీ ఇష్యూపై ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ సైతం రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లడ్డూ కల్తీ ఇష్యూపై చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 


Manchu Vishnu


ఈ క్రమంలో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ (Prakash raj) ఎక్స్‌ వేదికగా చేసిన పోస్ట్‌కు మరో నటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) సమాధానం ఇచ్చారు. దయచేసి ఇలాంటి విషయాల్లో ప్రకాశ్‌ సంయమనంతో వ్యవహరించాలని హితవు పలికారు.
 

"ప్రకాశ్‌రాజ్‌. దయచేసి మీరు మరీ అంతలా నిరుత్సాహపడి, అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు. నాలాంటి కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక. ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాలని ఇప్పటికే కోరారు.

ధర్మ పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటారు. ఇలాంటి వ్యవహారంలో మీలాంటి వారు ఉంటే, మతం ఏ రంగు పులుముకుంటుందో?. #మీ పరిధుల్లో మీరు ఉండండి. అని మంచు విష్ణు  ట్విట్టర్ లో  పేర్కొన్నారు"

Manchu Vishnu


తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై శుక్రవారం సాయంత్రం నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కోట్‌ చేస్తూ, ‘మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది.

విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, దీన్ని జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మనదేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు (కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు #జస్ట్‌ ఆస్కింగ్‌)’’ అని పోస్ట్‌ చేశారు. 
 


మంచు విష్ణు పెట్టిన పోస్ట్‌కు ప్రకాశ్‌రాజ్‌ కూడా నవ్వుతున్న ఎమోజీలు జోడించి రిప్లై ఇచ్చారు. ‘😂😂😂😂ఓకే శివయ్యా.. నా దృష్టికోణం నాకుంది. అలాగే మీకు కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి #జస్ట్‌ ఆస్కింగ్‌’’ అని పేర్కొన్నారు.


ప్రస్తుతం వీళ్లద్దరి మధ్య ఎక్స్‌ వేదికగా జరిగిన ఈ చర్చ  సోషల్ మీడియా లో ట్రెండ్‌ అవుతోంది. గతంలోనూ ‘మా’ ఎన్నికల సందర్భంగా అటు ప్రకాశ్‌రాజ్‌, ఇటు మంచు విష్ణు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తిరుమల లడ్డూ కల్తీ వివాదంలో ట్విట్టర్ లో  ఒకరి స్పందనలకు మరొకరు రిప్లై ఇస్తూ వార్తల్లో నిలిచారు.
 

Latest Videos

click me!