చదువు, మార్కుల ఒత్తిడితో యువత డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు. కానీ, చాలా తక్కువగా చదువుకున్న హీరోయిన్ దీపికా పదుకొణె తన కష్టంతో విజయ శిఖరాలను అధిరోహించారు. సక్సెస్ కు మార్కులే కొలమానం కాదు అంటోంది దీపిక.. ఆమె ఏం చదివిందో తెలుసా?
బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో దీపికా పదుకొణె ఒకరు. ఓ ఇంటర్వ్యూలో ఆమె చదువు, మార్కుల గురించి కొన్ని విషయాలు మాట్లాడారు. 2025 రిపోర్ట్ ప్రకారం, దీపిక 500 కోట్ల ఆస్తికి యజమానురాలు. జీవితానికి విజయం, లక్ష్యాన్ని చేరుకునే పట్టుదల కావాలి కానీ మార్కులు, ర్యాంకులు కాదని ఆమె అన్నారు.
27
యువతలో పెరిగిన నిరాశ..
పరీక్షలో మార్కులు తగ్గినా, ర్యాంక్ చేజారినా ఆత్మహత్య చేసుకునే యువత ఎందరో. దీనికి కారణం మార్కులనే కొలమానంగా భావించే తల్లిదండ్రులు, విద్యాసంస్థలే. వారి ఒత్తిడి వల్ల పిల్లలు ఇష్టం లేని ఉద్యోగాల్లో చేరడం, కలలు నెరవేరక డిప్రెషన్‌లోకి వెళ్లడం జరుగుతోంది.చాలా మంది విజయవంతమైన వ్యక్తులు తక్కువే చదువుకున్నారు. జీవితంలో నేర్చుకున్న పాఠాలే వారిని ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. జీవితానికి చదువు ముఖ్యమే అయినా, అదే సర్వస్వం కాదని ఎందరో నిరూపించారు. పాఠశాల మెట్లు ఎక్కని వారు కూడా గొప్ప విజయాలు సాధించారు. ఈ విషయాన్ని దీపికా రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
37
ఏ పాత్ర చేయడానికైనా రెడీ..
రొమాన్స్, కోపం, యాక్షన్. అన్ని జానర్లలో దీపికా పదుకొణె సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసింది సీనియర్ బ్యూటీ. 'పఠాన్' చిత్రంతో షారుఖ్ ఖాన్‌తో పాటు దీపిక డిమాండ్ కూడా భారీగా పెరిగింది. నటుడు రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. ఇటీవలే ఆమె తల్లి కూడా అయ్యింది.
దీపికా పదుకొణె జనవరి 5, 1986న డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జన్మించారు. ఆమె కన్నడ మూలాలున్న వ్యక్తి. బ్యాడ్మింటన్ స్టార్ ప్రకాష్ పదుకొణె, ఉజ్జల దంపతుల కుమార్తె. చిన్నప్పుడే వారి కుటుంబం బెంగళూరుకు మారడంతో, ఆమె విద్యాభ్యాసం అక్కడే సాగింది. సోఫియా స్కూల్, మౌంట్ కార్మెల్ కాలేజీలో చదివారు.
57
మోడలింగ్ నుంచి సినిమాల్లోకి
తర్వాత మోడలింగ్‌లోకి వచ్చి, 'ఐశ్వర్య' అనే కన్నడ చిత్రంతో నటన ప్రారంభించింది దీపికా... 'ఓం శాంతి ఓం'తో బాలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడే సెటిల్ అయ్యింది. దీపిక కెరీర్ లో 'పద్మావత్' వంటి బ్లాక్‌బస్టర్‌లు ఎన్నో ఉన్నాయి. నిర్మాతగానూ రాణించిన దీపికా పదుకొణె. 2018లో రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకుంది.
67
దీపికా పదుకొణె ఏం చదువుకుంది.. ?
ఇంత సాధించిన దీపిక చదివింది కేవలం 12వ తరగతి వరకే. అంటే, ఇంటర్మీడియట్ (PUC 2nd year) మాత్రమే. అవును! కొన్ని నెలల క్రితం దీపిక స్వయంగా ఈ విషయం చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. విజయానికి కావాల్సింది కఠోర శ్రమ, క్రమశిక్షణ అని చెప్పిన దీపిక, తాను ఎందుకు ఉన్నత విద్యను అభ్యసించలేకపోయిందో తెలిపారు.
77
సక్సెస్ కోసం ఏం చేసిందంటే?
దీపికా పదుకొణె మాట్లాడుతూ.. 'విజయం కోసం నేను కుటుంబానికి దూరంగా ఉన్నాను. 12వ తరగతి పాసైన వెంటనే నా కలలను వెంబడించాను. అందుకే నా చదువును పూర్తి చేయలేకపోయాను. మొదట్లో నా తల్లిదండ్రులు బాధపడ్డారు. నేను బాగా చదువుకోవాలని వారు కోరుకున్నారు. చదువు పూర్తయ్యాకే సినిమా పరిశ్రమలోకి వెళ్లమన్నారు.' కానీ నాకు ఆ టైమ్ దొరకలేదు. అని ఆమె అన్నారు.