సందీప్‌ రెడ్డి వంగా, నాగ్‌ అశ్విన్‌లకు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన దీపికా పదుకొనె

Published : Nov 20, 2025, 02:51 PM IST

దీపికా పదుకొనె సినిమాల్లో వర్క్ కల్చర్‌పై స్పందించింది. సందీప్‌ రెడ్డి వంగా, `కల్కి 2` మేకర్స్ పై స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. వాటిని లెక్కచేయనని చెప్పింది దీపికా. 

PREV
15
సందీప్‌ రెడ్డి వంగా, నాగ్‌ అశ్విన్‌లకు దీపికా పదుకొనె కౌంటర్‌

బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె `కల్కి 2898 ఏడీ` చిత్రంతో టాలీవుడ్‌ ఆడియెన్స్ కి పరిచయం అయిన విషయం తెలిసిందే. ఇందులో తనదైన నటనతో మెప్పించింది. తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. కానీ అనూహ్యంగా ఆమె `కల్కి 2` నుంచి తప్పుకుంది. మేకర్స్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. అంతకు ముందు ప్రభాస్‌, సందీప్‌ రెడ్డి వంగా `స్పిరిట్` మూవీలో ఎంపికై ఆ తర్వాత తప్పుకుంది. ఇది వివాదంగా మారింది. అప్పుడు సందీప్‌ రెడ్డి వంగా పెట్టిన పోస్ట్ పెద్ద రచ్చ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఈ వివాదాలపై, పని పరిస్థితులపై ఫస్ట్ టైమ్‌ స్పందించింది దీపికా పదుకొనె. సందీప్‌ రెడ్డి వంగా, నాగ్‌ అశ్విన్‌లకు అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చింది.

25
ఐదు వందల కోట్ల మూవీ అయినా సరే పని పరిస్థితులు ముఖ్యం

వంద కోట్లు, ఐదు వందల కోట్లు సినిమాలైనా సరే తాను అర్థమవంతమైన సినిమాలకు ప్రయారిటీ ఇస్తానని చెప్పింది దీపికా. ప్రస్తుతం తన వర్క్ ప్రయారిటీ మారిపోయిందని, కీర్తి, డబ్బు తనని నడిపించవని, అర్థవంతమైన కథలు, ఆరోగ్యకరమైన పని పరిస్థితులపై దృష్టిపెట్టినట్టు చెప్పింది.  వంద కోట్లు, ఐదు వందల కోట్ల సినిమాల గురించి ఆలోచించడం లేదని, ఔత్సాహిక ప్రతిభని ప్రోత్సహించడంలో నిజమైన ఆనందం ఉందని ఇప్పుడిప్పుడే తెలుసుకున్నట్టు తెలిపింది దీపికా. ఈ క్రమంలో మనిషికి ఎనిమిది గంటల పని చాలు. దానితోనే బాడీ, మైండ్‌ అలసిపోతాయని పేర్కొంది.

35
హీరోలు 8 గంటలే చేస్తున్నారు, దాన్ని ఎప్పుడూ హైలైట్‌ చేయలేదు

కొనిసార్లు మనీ ఆఫర్‌ చేస్తే సరిపోతుందని చాలా మంది నిర్మాతలు భావిస్తారు, కానీ దానికి రివర్స్ గా నిజాలుంటాయని పేర్కొంది. భారీ బడ్జెట్‌ చిత్రాలు, కమర్షియల్‌ మూవీస్‌ అయినా పని విధానంలో తాను స్పష్టంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొంది. తాను తీసుకున్నది గొప్ప నిర్ణయమని, ధైర్యసాహసాలతో కూడిన నిర్ణయమని భావించడం లేదని, చాలా సాధారణంగానే ఆ విషయాన్ని చెప్పానని వెల్లడించింది. రోజుకి ఎనిమిది గంటల పని అనేది అన్ని పరిశ్రమల్లో ఉంది. బాలీవుడ్‌లోనే కాదు, ఇతర పరిశ్రమల్లో ఉంది, ఇతర రంగాల్లో ఉంది. హీరోలు కొన్ని ఏళ్లుగా ఎనిమిది గంటల పని విధానాన్ని ఫాలో అవుతున్నారు. కానీ అదెప్పుడూ హెడ్‌లైన్‌లో రాలేదంటూ సెటైర్లు వేసింది దీపికా పదుకొనె. బ్రూట్‌ ఇండియా అనే ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది.

45
`స్పిరిట్‌`, `కల్కి 2` నుంచి తప్పుకున్న దీపికా

ప్రస్తుతం దీపికి పదుకొనె చేసిన వ్యాక్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇటీవల దీపికా `స్పిరిట్‌`, `కల్కి 2` ల నుంచి తప్పుకున్న నేపథ్యంలో, దీపికాని ఉద్దేశించి, దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా, అలాగే `కల్కి 2` మేకర్స్ సోషల్‌ మీడియాలో పోస్ట్ లు పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు దీపికా స్పందన వాళ్లకి కౌంటర్‌ గానే భావిస్తున్నారు నెటిజన్లు. దీంతో ఆమె కామెంట్స్ నెట్టింట పెద్ద రచ్చ చేస్తున్నాయి.

55
అల్లు అర్జున్‌తో సైన్స్ ఫిక్షన్‌ మూవీలో దీపికా

ఇక ప్రస్తుతం దీపికా పదుకొనె అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న `ఏఏ22` చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. సూపర్‌ హీరో కథాంశంతో సైన్స్ ఫిక్షన్‌గా రూపొందుతున్న ఈ మూవీలో ఆమె సూపర్‌ హీరో తరహా పాత్రలో కనిపించబోతుందని, యాక్షన్ చేయబోతుందని సమాచారం. దీంతోపాటు బాలీవుడ్‌ లో షారూఖ్‌ కాన్‌తో `కింగ్‌` చిత్రంలో నటిస్తోంది దీపికా.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories