టాప్ 10 ఇండియన్ కాస్ట్లీ డైరెక్టర్స్ లో తెలుగు దర్శకులు ఎంతమంది? నెంబర్ వన్ ప్లేస్ ఎవరిదో తెలుసా?

Published : Nov 20, 2025, 02:45 PM IST

Indias Highest Paid Film Directors : దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకులు చాలామంది ఉన్నారు. వీరిలో బాలీవుడ్‌ కన్నా కూడా  సౌత్ దర్శకులు ఎక్కువగా ఉన్నారు. ఒక సినిమాకు కోట్లు వసూలు చేసే టా ప్ 10 డైరెక్టర్లలో ఫస్ట్ ప్లేస్ ఎవరిదంటే? 

PREV
111
టాప్ 10 ఇండియన్ కాస్ట్లీ డైరెక్టర్స్

బాలీవుడ్ నుంచి సౌత్ ఫిల్మ్  ఇండస్ట్రీ వరకు చాలా మంది దర్శకులు భారీగా రెమ్యునరేషన్స్ వసూలు చేస్తున్నారు. మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు. ఈ ప్యాకేజీలో సౌత్ దర్శకులు ఎక్కువగా ఉన్నారు. ఇక టాప్ 10 కాస్ట్లీ డైరెక్టర్స్ గురించి చూస్తే..

211
సిద్ధార్థ్ ఆనంద్

బాలీవుడ్  దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఒక సినిమాకు దర్శకత్వం వహించడానికి 45 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న  ఆయన తదుపరి సినిమా 'కింగ్'.

311
శంకర్

సౌత్ స్టార్  డైరెక్టర్ శంకర్ కు హాలీవుడ్ రేంజ్ లో సినిమాలు చేసే సత్తా ఉంది. ఆయన  చాలా పాపులర్. ఆయన ఒక సినిమాకు దర్శకత్వం వహించడానికి శంకర్  50 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటన్నట్టు తెలుస్తోంది. ఆయన రాబోయే సినిమా 'ఇండియన్ 3'.

411
లోకేష్ కనగరాజ్

సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ ఫేమస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ప్రస్తుతం తమిళంలో ఆయన పేరే ఎక్కువగా వనిపిస్తోంది. ఇక  ఒక సినిమా డైెరెక్ట్ చేసినందుకు లోకే 60 కోట్ల రూపాయల ఫీజు తీసుకుంటారు. ఆయన రాబోయే సినిమాలు 'ఖైదీ 2', 'విక్రమ్ 2'.

511
సంజయ్ లీలా భన్సాలీ

బాలీవుడ్ మోస్ట్ పాపులర్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఒక సినిమాకు 65 కోట్ల రూపాయల రెమ్యునరేషన్  తీసుకుంటారు. ఆయన రాబోయే సినిమా 'లవ్ అండ్ వార్'.

611
సుకుమార్

సౌత్ సినిమాకు రాజమౌళి తరువాత అంత పేరు తీసుకువచ్చిన దర్శకుడు సుకుమార్. పుష్ప2 తో ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ఈ హిట్ డైరెక్టర్  ఒక సినిమాకు 75 కోట్ల రూపాయల ఫీజు ఛార్జ్ చేస్తారు. ఆయన రాబోయే సినిమా 'రామ్ చరణ్ కొత్త సినిమాతో పాటు, పుష్ప3. 

711
రాజ్‌కుమార్ హిరాణీ

బాలీవుడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ చాలా హిట్ సినిమాలు ఇచ్చారు. డిఫరెంట్ కాన్సెప్ట్ పిక్చర్స్ తీయ్యడంలో ఆయనకు ఆయనే సాటి. ఇక రాజ్ కుమర్  ఒక సినిమాకు 80 కోట్ల ఫీజు ఛార్జ్ చేస్తారు. ఆయన రాబోయే సినిమా దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్.

811
ప్రశాంత్ నీల్

సౌత్ బ్లాక్‌బస్టర్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక్క సినిమాకు దాదాపు  100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. . ఆయన రాబోయే సినిమాలు 'డ్రాగన్', 'సలార్ 2'.

911
అట్లీ కుమార్

సౌత్ సూపర్ డైరెక్టర్ అట్లీ కుమార్ ఒక సినిమాకు 100 కోట్లు ఛార్జ్ చేస్తారు. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ తో జవాన్ డైరెక్ట్ చేసిన అట్లీ.. ఈసినిమాతో 1000 కోట్ల కలెక్షన్ డైరక్టర్ గా మారిపోయాడు.  ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి  AA22 x A6 బిజీలో ఉన్నాడు అట్లీ. 

1011
సందీప్ రెడ్డి వంగా

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా స్టార్ డైరెక్టర్ గా..  చాలా సూపర్‌హిట్ సినిమాలు ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా రెమ్యునరేషన్  100 కోట్లకుపైనే అని చెప్పాలి. ఆయన రాబోయే సినిమాలు 'స్పిరిట్', 'యానిమల్ పార్క్'.

1111
రాజమౌళి

సౌత్‌లో అత్యంత విజయవంతమైన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఆయన చేసిన  ఏ సినిమా ఇంత వరకూ ఫ్లాప్ అవ్వలేదు. కాస్ట్లీ డైరెక్టర్ల లిస్ట్ లో రాజమౌలి మొదటి స్థానంలో ఉన్నారు.  ఒక సినిమాకు జక్కన్న  200 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని సమాచారం. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు హీరోగా పాన్ వరల్డ్ మూవీ వారణాసిని తెరకెక్కిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories