దీపికా, కరీనా.. ఆలియా తో పాటు ప్రెగ్నెంట్ గా ఉండి సినిమాల్లో నటించిన హీరోయిన్లు ఇంకెవరంటే..?

First Published Jun 26, 2024, 9:33 AM IST

సినిమా కోసం చాలామంది హీరోయిన్లు రిస్క్ చేసినసందర్భాలు ఉన్నాయి. ప్రెగ్నెన్సీతో ఉన్నా కాని.. తాము కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేయాలని పట్టుదలతో షూటింగ్ కు వచ్చిన తారలు కొదరు ఉన్నారు. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరంటే..? 
 

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలతో పాటు.. కొందరు హీరోయిన్లు  కూడా తాము చేస్తున్న సినిమాల కోసం సిన్సియర్ గా పనిచేయడంతో పాటు.. రిస్క్ చేయడానికి కూడా వెనకాడటం లేదు. హీరోలు అయితే.. యాక్షన్ సీక్వెన్స్ ల విషయంలో ఈ ఫార్ములా ఉపయోగిస్తారు.. కాని హీరోయిన్లు అయితే..ప్రెగ్నెన్సీ లాంటి రిస్కీ కండీషన్స్ లో  కూడా షూటింగ్స్ లో పాల్గొంటూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈలిస్ట్ లో ఎవరెవరు ఉన్నారంటే..? 

deepika padukone

రీసెంట్ గా బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ప్రెగ్నెన్సీ ప్రకటించింది.  త్వరలో ఆమె  తల్లి కాబోతోంది. కల్కి సినిమా చివరిదశలోనే ఆమె ప్రెగ్నెస్నీ కన్ఫార్మ్ అయినట్టు తెలుస్తోంది. అయితే నిండు గర్బిణిగా ఉన్న దీపికా.. తాజాగా కల్కి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కనిపించింది. ఈ ఈవెంట్‌లో కాబోయే తల్లి దీపికా పదుకొనే బ్లాక్ డ్రెస్‌లో బేబీ బంప్ చూపిస్తూ కనిపించింది. దీపిక ముఖంలో గర్భవతి అయిన కళ స్పష్టంగా కనిపించింది.

మోక్షజ్ఞ కు పోటీగా మరో స్టార్ హీరో వారసుడు... బాలయ్య కు తలనొప్పిగా మారిన వారసుడి ఎంట్రీ..?

దీపికా తో పాటు గతంలో కూడా ప్రెగ్నెంట్ తో ఉండి ఇలానే తమ పనులు చేసుకున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. గతంలో స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కూడా ఇలానే ప్రగ్నెంట్ తో ఉండే తన సినిమాను కంప్లీట్ చేసింది. రెండో సారి కరీనా ప్రెగ్నెంట్ అయినప్పుడు కరీనా కపూర్ లాల్ సింగ్ చద్దా సినిమా చివరి దశ షూటింగ్ లో ఉంది. తాను ఆ పరిస్థితుల్లో ఉండి కూడా షూటింగ్ కంప్లీట్ చేసింది సీనియర్ బ్యూటీ. 
 

రామ్ చరణ్ కు ఆస్తి విషయంలో ఉపాసన షాక్..? మెగా కోడలి ఆస్తి ఎన్ని వేల కోట్లంటే..?

బాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్  అలియా భట్ కూడా ప్రెగ్నెంట్ ఉండి సినిమాలో నటించింది. రిచీ మెహతాతో ‘పోచర్’ కోసం చర్చలు జరుపుతున్నప్పుడు తాను గర్భం చివరి దశలో ఉన్నానని వెల్లడించింది. అంతే కాదుప్రెగ్నెన్సీలో ఉండి  కూడా  ఆమె ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ, హార్ట్ ఆఫ్ స్టోన్’ సినిమాలను పూర్తి చేసింది.
 

త్రిష వల్ల విజయ్ పొలిటికల్ కెరీర్ కు ఇబ్బందులు....? దళపతికి కష్టాలు తప్పవా..?

యంగ్ హీరోయిన్  యామీ గౌతమ్ కూడా ఇలాంటి పరిస్థితినే ఫేస్ చేసింది.  ‘ఆర్టికల్ 370’ షూటింగ్ సమయంలో తాను గర్భవతి అన్న విషయం తెలిసింది. అయితే ఆమె ఆ సమయంలో  అధైర్యపడకుండా..కొన్ని జాగ్రత్తలు తీసుకుని  షూటింగ్ కొనసాగించింది.
 

రజినీకాంత్ తో వెయ్యి కోట్ల బడ్జెట్ సినిమా.. డైరెక్ట్ చేయబోయేది ఎవరో తెలుసా..?

‘ఏక్ రిష్తా: ది బాండ్ ఆఫ్ లవ్’ చిత్రీకరణకు ముందు జుహీ చావ్లా తాను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు  దర్శకుడు సునీల్ దర్శన్ , నటుడు అమితాబ్ బచ్చన్ ఆమెకు మద్దతుగా నిలిచారు. అంతేకాదు జూహీ బేబీ బంప్ కనిపించకముందే షూటింగ్  పూర్తి చేయడానికి వారు షెడ్యూల్‌లను సర్దుబాటు చేసారు.
 

ముస్లిం హీరోల ను పెళ్లాడిన హిందూ హీరోయిన్లు ఎవరో తెలుసా..?

 వి ఆర్ ఫ్యామిలీ మూవీ   షూటింగ్ సమయంలో కాజోల్ ప్రెగ్నెస్నీతో ఉంది. ఈసినిమా టైమ్ లో ఆమె తన రెండవ బిడ్డకోసం ప్రెగ్నెన్సీతో ఉంది. అంతకు ముందు కాజోల్ కభీ ఖుషీ కభీ ఘమ్ మూవీ రిలీజ్ టైమ్ లో  అబార్షన్ జరిగి మొదటి బిడ్డను కోల్పోయింది.  అయినా కూడా ఆమె ఆ తరువాత, సినిమా టీం, ఆమె వ్యక్తిగత సహాయంతో రెండో బిడ్డ కడుపులో ఉండతాను షూటింగ్ లో ధైర్యంగా పాల్గోంది. 
 

ఇక బిగ్ బీ అమితాబ్ భార్య.. జయా బచ్చన్ కూడా ఈసాహసం చేశారు. ఆమె 1975లో వచ్చిన చుప్కే చుప్కే సినిమా షూటింగ్ టైమ్ లో  జయ బచ్చన్ తన కుమార్తె శ్వేతతో గర్భవతిగా ఉన్నారు. అయినా సరే ఆమె ఈసినిమా కోసం  పనిచేశారు. దర్శకుడు హృషికేష్ ముఖర్జీ లాంటి గొప్ప డైరెక్టర్ తో సినిమా చేయాలి అన్న ఆశతో.. ఆమె ఇలా చేశారు. 

Latest Videos

click me!