`కల్కి` ప్రీ రిలీజ్ బిజినెస్ డిటేల్స్ (ఏరియావైజ్), ఆ కండీషన్ తోనే ఎగ్రిమెంట్స్

First Published Jun 26, 2024, 9:11 AM IST

  అన్నిచోట్లా బుక్కింగ్స్ ఓపెన్ అయ్యాయి. చాలా వేగంగా టిక్కెట్లు అమ్ముడు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే చెప్పక్కర్లేదు. 

Kalki

ఆకాశాన్ని అంటే అంచనాలతో  మరి కొద్ది గంటల్లో రిలీజ్ కి రాబోతున్న   “కల్కి 2898 ఎడి” వరల్డ్ వైడ్ గా భారీగానే బిజినెస్ జరుపుకుంది.  తెలుగు సహా హిందీ, తమిళ్ లో కూడా గ్రాండ్ గానే రిలీజ్ కాబోతుంది. అన్నిచోట్లా బుక్కింగ్స్ ఓపెన్ అయ్యాయి. చాలా వేగంగా టిక్కెట్లు అమ్ముడు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే చెప్పక్కర్లేదు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అయ్యింది. ఎంతొస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందో చూద్దాం.

Kalki

వాస్తవానికి ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కు రికార్డ్ ప్రైస్ లు కోట్ చేసారు నిర్మాతలు. అయితే డిస్ట్రిబ్యూటర్స్ ఆ రేట్లుకు మేము తీసుకోలేమని తేల్చి చెప్పారు. అయితే అశ్వినీదత్ కు సినిమాపై పూర్తి నమ్మకం. తాను తగ్గించి అమ్మేదేలేదని స్పష్టం చేసారు. రూపాయికు వందరూపాయలు వస్తుందని ఆయన నమ్మకంగా చెప్పటంతో డిస్ట్రిబ్యూటర్స్ ధైర్యం చేసారు. ఎందుకంటే ప్రభాస్ సలార్ చిత్రం కొన్ని ఏరియాల్లో దెబ్బ  కొట్టింది. తర్వాత రికవరీ లు చేసారు. దాంతో ఈ సినిమాని అనుమానంగా చూసారు. 

Latest Videos


అయితే ఇప్పటికే రిలీజైన ట్రైలర్, రెండు రాష్ట్రాల్లోనూ సినిమా టిక్కెట్లు పెంచటానికి ప్రభుత్వం ఫర్మిషన్ ఇవ్వటం, అలాగే ప్రత్యేక షోలకు అనుమతులు తేవటం వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చింది. బాహుబలి చిత్రంలాగ ఈ సినిమా బారీ హిట్ అవుతుందని నమ్ముతున్నారు.  ఫస్ట్ వీకెండ్ కుమ్మేస్తుందని, టాక్ ఏ మాత్రం హిట్ లేదా బ్లాక్ బస్టర్ అని వస్తే ఇంక జనాలు థియేటర్స్ దగ్గర క్యూలు కట్టే పరిస్దితి ఉంటుందని లెక్కేసి సినిమా రైట్స్ తీసుకున్నారు. 
 

ఈ క్రమంలో కల్కి తెలుగు సినిమా చరిత్రలోనే  వన్ ఆఫ్ ది హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకుంది, ఇది వరకటిలా నాన్ రిఫండబుల్ అమౌంట్ కింద బిజినెస్ చేయకుండా అడ్వాన్స్ బేస్ మీద భారీ బిజినెస్ ను చేశారు . అంటే సినిమా ఒకవేళ ఈ స్దాయి బిజినెస్ ను రికవరీ చేయకపొతే అడ్వాన్స్ లు పే చేసిన వాళ్ళకి వచ్చిన నష్టాలు మేకర్స్ రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అగ్రిమెంట్ కింద సినిమాకి భారీగా  అడ్వాన్స్ లు దక్కాయి. 

ఏరియా వైజ్ ఆ లెక్కలు చూస్తే...

 
👉నైజాం : 65Cr
👉సీడెడ్ : 27Cr
👉ఉత్తరాంధ్ర : 21Cr
👉ఈస్ట్ గోదావరి : 14Cr
👉వెస్ట్ గోదావరి : 10Cr
👉గుంటూరు : 12Cr
👉కృష్ణా : 12Cr
👉నెల్లూరు : 7Cr
ఆంధ్రా, తెలంగాణా టోటల్ :- 168CR

👉కర్ణాటక : 25Cr(Valued)
👉తమిళనాడు : 16Cr(Valued)
👉కేరళ : 6Cr(Valued)
👉హిందీ + రెస్టాఫ్ ఇండియా : 85Cr(Valued)
👉ఓవర్ సీస్  – 70Cr
మొత్తం ప్రపంచ వ్యాప్త కలెక్షన్స్ : 370CR(Break Even- 372CR+)
 

kalki 2898 ad

అంటే గ్రాస్ 700 కోట్లు దాకా కలెక్ట్ చేయాలి. అంటే సలార్, బాహుబలి 1 కన్నా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. అయితే పెరిగిన రేట్లలో రికవరీ ఈజీగానే అయ్యే అవకాసం ఉందని ట్రేడ్ అంటోంది.   కల్కి 2898 ఏడీ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000కోట్ల మార్క్ సులువుగా దాటేస్తుందనే అంచనాలు ఉన్నాయి. పాజిటివ్‍గా వస్తే చాలా రికార్డులు బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన రెండు ట్రైలర్లు విజువల్ వండర్‌గా ఉంటూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. గ్లోబల్ రేంజ్‍లో ఈ మూవీకి హైప్ ఉంది.
 

Prabhs Kalki 2898 ADs

మరో ప్రక్క ‘కల్కి’ విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ప్రీ సేల్‌ బుకింగ్స్‌లో ఇప్పటికే కొన్ని బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల రికార్డులను బ్రేక్‌ చేయగా.. ఇప్పుడు ‘సలార్‌’ (Salaar) రికార్డును కూడా అధిగమించింది.  ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ (Kalki 2898 AD) జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓవర్సీస్‌లో మాత్రం ఒకరోజు ముందుగానే (జూన్‌26) విడుదల కానుంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రీ సేల్స్‌ ఓపెన్‌ చేయగా అవి ప్రభాస్‌ (Prabhas) గత చిత్రం రికార్డును బ్రేక్ చేశాయి. 

‘సలార్‌’ ప్రీ సేల్‌ బుకింగ్స్‌ను ‘కల్కి’ రిలీజ్‌కు ఒక్కరోజు ముందుగానే క్రాస్‌ చేసింది. ఈ చిత్రం ప్రీ సేల్స్‌ ప్రారంభించిన గంటల్లోనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డులను బ్రేక్‌ చేసింది. ఇక ఇప్పటి వరకు కేవలం నార్త్‌ అమెరికాలోనే 1,25,000 టికెట్స్‌ అమ్ముడైనట్లు నిర్మాణ సంస్థ తెలిపింది.
 

 ‘కల్కి’ ఓపెనింగ్‌ కలెక్షన్లు రూ.200 కోట్లు ఖాయమంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్‌ గతంలో నటించిన ‘బాహుబలి-2’, ‘సలార్‌’, ‘ఆదిపురుష్‌’, ‘సాహో’ చిత్రాలు మొదటిరోజు రూ.100కోట్లు సాధించిన సంగతి తెలిసిందే. వీటికంటే ‘కల్కి’కి ఎక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశమున్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. 

తాజాగా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న  ప్రభాస్ మాట్లాడుతూ.. “కల్కి సినిమాలో నా పాత్ర చాలా గ్రే షేడ్స్‌తో ఉంటుంది. అలాగే, నేను సూపర్‌ హీరోగా కనిపిస్తాను, దానికి హ్యూమర్ టచ్ కూడా ఉంటుంది. కాకపోతే, తెలుగు ప్రేక్షకులు నన్ను ఇలాంటి పాత్రలో ఇంతకు ముందు చూశారు. కానీ ఇతర భాషల్లోని ప్రేక్షకులకు ఈ పాత్రలో నన్ను చూడటం కొత్తగా అనిపిస్తోంది. పైగా గ్రే షేడ్స్‌తో కూడిన ఫన్నీ క్యారెక్టర్‌లో నన్ను నేను చూసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది’ అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. 
 

Kalki

కాగా వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కల్కి’లో  కమల్ హాసన్‌ విలన్‌గా కనిపించనున్నారు. సుప్రీం యాస్కిన్‌ పాత్రను ఆయన (Kamal Haasan) పోషించారు. తాజాగా ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తన పాత్రను అంగీకరించడానికి ఏడాది సమయం తీసుకున్నట్లు తెలిపారు.  ‘ఈ పాత్ర గురించి చెప్పగానే నాకు స్వీయసందేహం వచ్చింది. నేను దీన్ని చేయగలనా అనిపించింది. గతంలో చాలా సినిమాల్లో విలన్‌గా నటించాను. కానీ, ఇది వాటికి మించినది. భిన్నమైన పాత్ర. అందుకే దీనికి సంతకం చేయడానికి ఏడాది ఆలోచించా’ అని చెప్పారు.

  కమల్ ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ తో ఉన్నారు.  రీసెంట్ గా జరిగిన ఓ   ఈవెంట్ లో కమల్ హాసన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కమల్ హాసన్ మాట్లాడుతూ.. “నాగ్ అశ్విన్ మా గురువు గారు బాలచందర్ గారిలా ఆర్డినరీగా కనిపించే ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్.పైకి సాధారణంగా కనిపించే వారంతా అసాధారణమైన పనులు చేస్తుంటారు. నాగ్ అశ్విన్ తో కాసేపు మాట్లాడగానే అతని టాలెంట్ ఏంటనేది తెలిసిపోతుంది. తన ఐడియాని అద్భుతంగా ప్రజెంట్ చేసే నేర్పు నాగ్ అశ్విన్ కి ఉంది.
 

 ఇందులో బ్యాడ్ మ్యాన్ గా కనిపిస్తాను. ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. నా పాత్రని నాగ్ అశ్విన్ చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు. నా ఫస్ట్ లుక్ చూసి సర్ ప్రైజ్ అయినట్లే సినిమా చూసి కూడా చాలా సర్ ప్రైజ్ అవుతారు. నా లుక్ కోసం చాలా రీసెర్చ్ చేశాం. ఆడియన్స్ నా పాత్రని ఎలా రిసీవ్ చేసుకుంటారా? అనే ఆసక్తి రోజురోజుకు పెరుగుతుంది” అంటూ చెప్పుకొచ్చారు.

Kalki

అలాగే కల్కి చిత్రం స్టార్ట్ అయ్యే ముందు ఎంతో ఆసక్తిగా ఉన్నా, అప్పుడు నేను చాలా ఆశ్చర్య పోయాను. ఇప్పుడు విస్మయంలో ఉన్నా అని అన్నారు. కమల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ చిత్రంలో కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్రలో కనిపించనున్నారు.  

click me!