ఎపిసోడ్ ప్రారంభంలోనే.... దీప జరిగిన గతమంతా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. నేను దొరికినట్టే డాక్టర్ బాబు కూడా ఎవరికైనా దొరుకుతారా?. డాక్టర్ బాబు కూడా నా కోసం ఇంతే ఎదురుచూస్తూ ఉంటారా? అని బాధపడుతూ ఉండగా అక్కడున్న డాక్టర్ నీ పేరేంటి అమ్మ? అసలు ఎవరి డాక్టర్ బాబు? అని అడుగుతాడు. అప్పుడు దీప, తను ఒక పెద్ద డాక్టర్ అని, తన భర్తని ఇలా జరిగిన కథంతా చెప్తాది. దీపా డాక్టర్ని అన్నయ్య అని పిలుస్తుంది. అప్పుడు ఆ డాక్టర్ నేను డాక్టర్ గా చేయవలసినంత చేశాను. నో రారా నువ్వు అన్నయ్య అని పిలిచావు. నీ భర్తని ఎలాగైనా మనం వెతుకుదాము.