Karthika Deepam: శ్రావ్య బాబు మిస్సింగ్.. దీప కష్టాన్ని చూసి తట్టుకోలేకపోతున్న కార్తీక్!

Navya G   | Asianet News
Published : Dec 23, 2021, 10:27 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
19
Karthika Deepam:  శ్రావ్య బాబు మిస్సింగ్.. దీప కష్టాన్ని చూసి తట్టుకోలేకపోతున్న కార్తీక్!

మోనిత సౌందర్య (Soundarya) దగ్గరికి వచ్చి తన మాటలతో సౌందర్యను రెచ్చగొడుతుంది. సౌందర్య కోపం తట్టుకోలేక తనతో పోల్చుకోకూడదని గట్టిగా వార్నింగ్ ఇవ్వటంతో మోనిత (Monitha) అక్కడినుంచి మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోతుంది.
 

29

ఇక వారణాసిని (Varanasi) అక్కడినుంచి పంపి కార్తీక్, దీప ఎక్కడున్నారో అని ఆలోచిస్తుంది. మరోవైపు కార్తీక్ (Karthik) తన ఇద్దరు పిల్లలతో కలిసి మొక్కలను నాటుతారు. ఇక పిల్లలు మొక్కల గురించి ప్రశ్నలు వేయటంతో వారికి మంచి సమాధానం ఇస్తాడు.
 

39

అంతలోనే దీప (Deepa) వచ్చి వాళ్లకు సహాయం చేయడానికి వెళుతుంది. అక్కడే ఉన్న శ్రీవల్లి దీపను బాగా గమనించి మెడలో బంగారం ఏదని ప్రశ్నిస్తుంది. ఇక దీప చెప్పడానికి తడబడటం తో శ్రీ వల్లి అర్థం చేసుకుంటుంది. బాబు ఏడవటంతో శ్రీవల్లితో (Srivalli) పాటు పిల్లలు కూడా లోపలికి వెళ్తారు.
 

49

ఇక కార్తీక్ (Karthik) దీప బంగారం తాకట్టు పెట్టిందని తెలియడంతో కార్తీక్ చాలా బాధపడతాడు. తను ఏం చేస్తున్నాను అంటూ చేతకాని పరిస్థితిలో ఉన్నాను అంటూ బాధపడతాడు. ఇక దీప (Deepa) కార్తీక్ దగ్గరికి వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది.
 

59

మోనిత (Monitha) ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది. సౌందర్య అన్న మాటలను తలుచుకుంటూ బాబు గురించి పట్టించుకోవడం లేదా అన్నట్లు తనలో తాను  మాట్లాడుకుంటుంది. ఎక్కడున్నావ్ ఆనందరావు (Anadharao) అంటూ తన బాబు ని తలచుకుంటూ బాధపడుతుంది.
 

69

ఇక దీప (Deepa) తాకట్టుపెట్టిన బంగారం షేట్ జీ వచ్చి రుద్రాణి కి ఇస్తాడు. ఇక రుద్రాణి తన దగ్గరికి దీప వచ్చి బంగారం అడిగినప్పుడు తనకు అమ్మనని చెప్పమంటుంది. ఇక షేట్ జీ కూడా రుద్రాణి (Rudrani) మాటలను సరే అని అక్కడనుంచి వెళ్ళి పోతాడు. 
 

79

చీకటి పడటంతో దీప రుద్రాణి (Rudrani) గురించి ఆలోచిస్తుంది. ఇక పిల్లలకు నిద్రపట్టక పోవడంతో కథలు చెప్పమని అంటారు. అప్పుడే బాబు ఏడవటంతో హిమ (Hima).. బాబు ఏడుస్తున్నప్పుడు నాన్న ఎత్తుకోగానే ఊరుకున్నాడు అని కాసేపు మాట్లాడుతుంది.
 

89

మరోవైపు శ్రావ్య (Sravya) బాగా ఏడుస్తూ వస్తుంది. దీపు కనిపించడం లేదని ఏడిస్తూ సౌందర్య కు చెబుతుంది. ఇల్లు మొత్తం వెతికిన కూడా బాబు కనిపించకపోయేసరికి అప్పుడే మోనిత (Monitha) రావడంతో తానే ఏం చేసిందో అని శ్రావ్య అడుగుతుంది.
 

99

శ్రావ్య మోనిత (Monitha) దగ్గరికి వెళ్లి బతిమాలడం తో తానే దాచానని చెబుతోంది. కొడుకు కనిపించకపోయేసరికి బాధ ఎలా ఉంటుదో శ్రావ్య ద్వారా చూపించింది మోనిత. తరువాయి భాగం లో దీప కష్టాన్ని చూసి కార్తీక్ (Karthik) తట్టుకోలేకపోతున్నాడు.

click me!

Recommended Stories