NBK shock to Nagarjuna: నాగార్జునకి చెక్‌ పెట్టబోతున్న బాలకృష్ణ.. బిగ్‌బాస్‌ 6కి హోస్ట్ ఎవరంటే?

Published : Dec 22, 2021, 10:35 PM IST

బిగ్‌బాస్‌5 సీజన్‌ పూర్తయ్యింది. మరోరెండు నెలల్లో బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌ ప్రారంభమవుతున్న నాగార్జున ఇటీవల ఐదో సీజన్‌ ఫినాలే రోజు వెల్లడించారు. అయితే ఇప్పుడు హోస్ట్ మారబోతున్నారనే వార్త సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది.   

PREV
110
NBK shock to Nagarjuna: నాగార్జునకి చెక్‌ పెట్టబోతున్న బాలకృష్ణ.. బిగ్‌బాస్‌ 6కి హోస్ట్ ఎవరంటే?

బిగ్‌బాస్‌ షో తెలుగులో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న రియాలిటీ షో. గత ఆదివారంతో బిగ్‌బాస్‌ తెలుగు 5వ సీజన్‌ పూర్తయ్యింది. వీజే సన్నీ ఐదో సీజన్‌ విన్నర్‌గా నిలిచారు. అంతా ఊహించినట్టే బిగ్‌బాస్‌ విన్నర్‌గా సన్నీ నిలవడం విశేషంగా చెప్పుకోవచ్చు. బిగ్‌బాస్‌ షో ఆరో సీజన్‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ సారి ఆలస్యం లేకుండా మరో రెండు నెలల్లో ఆరో సీజన్‌ ప్రారంభమవుతుందన్నారు. 

210

దీంతో ఇప్పుడు షో ఎలా ఉండబోతుంది, ఇంత త్వరగా షోని స్టార్ట్ చేయడానికి కారణమేంటి? ఈ సారి హోస్ట్ గా నాగార్జునే ఉంటారా? హోస్ట్ మారబోతున్నారా? అనే చర్చ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఆరో సీజన్‌కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. 

310

ఆరో సీజన్‌ బిగ్‌బాస్‌ తెలుగు షో ఓటీటీలో ప్రసారం కాబోతుందనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. హిందీలో మాదిరిగా మొదట ఓటీటీలో దీన్ని ప్రసారం చేయబోతున్నారట. ఆ తర్వాత ఓటీటీలో బాగా ప్రదర్శన చేసిన వారిని, బెస్ట్ కంటెస్టెంట్స్ ని స్టార్‌మాలో ప్రసారమయ్యే మెయిన్‌ బిగ్‌బాస్‌ 6కి ఎంపిక చేయబోతున్నారనే వార్త వైరల్‌ అవుతుంది. ఇది ఫిబ్రవరిలో స్టార్ట్ కానుందట. ఫిబ్రవరి ఎండింగ్‌లోగానీ, మార్చి మొదటి వారంలోగానీ ఆరో సీజన్‌ ఓటీటీలో ప్రసారమవుతుందని సమాచారం. 
 

410

ఇదిలా ఉంటే వచ్చే సీజన్‌కి హోస్ట్ మారబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. నాగార్జున ఐదో సీజన్‌కి సంబంధించి అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని మార్చేయాలని బిగ్‌బాస్‌ నిర్వహకులు భావిస్తున్నారట. కొత్త స్టార్‌ని దించాలనే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం.
 

510

అందులో భాగంగా బాలయ్యని హోస్ట్ గా తీసుకురావాలనే ఆలోచన లో ఉన్నట్టు టాక్. బాలకృష్ణ `అన్‌స్టాపబుల్‌` షోతో దూసుకుపోతున్నారు. `ఆహా` ఓటీటీలో ప్రసారమవుతున్న `అన్‌స్టాపబుల్‌విత్‌ ఎన్బీకే` షోకి హోస్ట్ గా చేస్తూ బాలయ్య ఆకట్టుకుంటున్నారు. రేటింగ్‌లో, వ్యూస్‌ పరంగా దీనికి మంచి స్పందన లభిస్తుండటం విశేషం. బిగ్‌స్టార్స్ సైతం ఈ షోలో పాల్గొంటూ సందడిచేస్తున్నారు. ఆద్యంతం షోని రక్తికట్టిస్తున్నారు. 

610

ఇప్పటి వరకు మోహన్‌బాబు, నాని, అఖండ టీమ్‌, రాజమౌళి, అల్లు అర్జున్‌, రవితేజ, గోపీచంద్‌మలినేని, అలాగే మహేష్‌బాబు పాల్గొన్నారు. ఇప్పటికే రాజమౌళి వరకు ఎపిసోడ్లు ప్రసారం కాగా, వరుసగా అల్లు అర్జున్‌ ఎపిసోడ్‌, రవితేజ ఎపిసోడ్‌, మహేష్‌ ఎపిసోడ్‌లు ప్రసారానికి రెడీగా ఉన్నాయి. 
 

710

ఈ సీజన్‌ ముగింపు మహేష్‌బాబుతో చేయబోతున్నట్టు తెలుస్తుంది. `అన్‌స్టాపబుల్‌విత్‌ ఎన్బీకే` 7వ ఎపిసోడ్‌ మహేష్‌తో అంటూ తాజాగా వెల్లడించారు. ఈ షోతోనే సీజన్‌ ముగుస్తుందని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఎపిసోడ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ టాక్‌ షోతో బాలయ్య బాగా ఆకట్టుకుంటున్నారు. తనదైన మ్యానరిజమ్‌తో, డేరింగ్‌ స్టెప్పులతోముందుకు సాగుతున్నారు. 

810

దీంతో బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌కి బాలయ్యని హోస్ట్ గా చెప్పబోతున్నారట. నాగార్జునకి ఈ సారి బాలయ్యతో చెక్ పెట్టాలని అనుకుంటున్నారట. ఇదే జరిగితే ఇది నాగ్‌కి పెద్ద షాకింగ్‌ విషయమే అంటున్నారు నెటిజన్లు. నాగ్‌ని పక్కన పెట్టి బాలయ్యని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. 
 

910

యితే బాలయ్యని ఓటీటీకి హోస్ట్ గా తీసుకుంటారా? లేక మెయిన్‌ షోకి హోస్ట్ గా తీసుకుంటారా? లేదా రెండింటికి హోస్ట్ గా తీసుకోబోతున్నారా? అన్నది ఆసక్తిగా మారింది. దీంతో ఇప్పుడీ విషయంలో టాలీవుడ్‌లో, అటు సోషల్‌ మీడియాలో ఇంట్రెస్ట్‌ గా మారింది. బిగ్‌బాస్‌ షోలో కంటెస్టెంట్లు చేసే ఎక్‌స్ట్రాలకు, వారి ఓవరాక్షన్‌ని కంట్రోల్‌ చేయాలంటే బాలయ్య లాంటి హోస్ట్ ఉండాలని భావిస్తున్నారట. 

1010

ఇదిలా ఉంటే ఐదో సీజన్‌ బిగ్‌బాస్‌ షోకి నాగార్జునపై విమర్శలు వచ్చాయి. ఆయన కొందరికి ఫేవర్‌గా వ్యవహారించారని, కొందరు పాజిటివ్‌గా ఉంటూ, మరికొందరిని టార్గెట్‌ చేసినట్టుగా ఉన్నారనే విమర్శలు వచ్చాయి. అదే సమయంలో రాంగ్‌ జడ్జ్ మెంట్‌ కూడా ఆయనపై విమర్శలకు కారణమైంది. సన్నీ, సిరి ల మధ్య జరిగిన ఓ గొడవ విషయంలో నాగ్‌ సరైన నిర్ణయం తీసుకోలేదని, సన్నీని దోషిగా చూపించే ప్రయత్నం చేశారని విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో బాలయ్య అయితే కరెక్ట్ గా ఉంటాడని, ఎవరికి ఎలాంటి ఝలక్‌లు ఇవ్వాలో పర్‌ఫెక్ట్ గా ఇస్తారని,  అందుకే బాలయ్యని ఛాయిస్‌గా తీసుకుంటున్నారని టాక్‌. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories