Karthika Deepam: రుద్రాణి దగ్గరే ఉంటానంటున్న హిమ.. చావు బతుకుల మధ్యలో పోరాడుతున్న సౌర్య!

Navya G   | Asianet News
Published : Feb 01, 2022, 07:59 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. రేటింగ్ లో కూడా ఈ సీరియల్ మొదటి స్థానంలో ఉంటుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
16
Karthika Deepam: రుద్రాణి దగ్గరే ఉంటానంటున్న హిమ.. చావు బతుకుల మధ్యలో పోరాడుతున్న సౌర్య!

హిమ (Hima) రుద్రాణి దగ్గరికి వెళ్లి సౌర్య ప్రాణాలు కాపాడటం కోసం డబ్బులు అడిగి తన దగ్గరే ఉంటానని అంటుంది. దానికి రుద్రాణి సంతోషంగా దగ్గరకు తీసుకుంటుంది. తనకోసం స్వీట్స్ తీసుకొచ్చి పెడుతుంది. కానీ హిమ దానికి నిరాకరిస్తోంది. పదే పదే సౌర్య (Sourya) గుర్తుకు రావడంతో డబ్బులు అడుగుతుంది.
 

26

ఇక దీప (Deepa) ఆవేశంగా రుద్రాణి దగ్గరికి వచ్చి మా కూతురిని ఎందుకు తీసుకు వచ్చావని గట్టిగా అడుగుతుంది. వెంటనే రుద్రాణి నేను తీసుకు రాలేదు అని తానే వచ్చింది అనేసరికి దీప నమ్మదు. మళ్లీ హిమ నిజం చెప్పటంతో షాక్ అవుతుంది. ఇక దీప రుద్రాణి (Rudrani) కి గట్టిగా వార్నింగ్ ఇచ్చి సౌర్యను తీసుకొని వెళుతుండగా..
 

36

రుద్రాణి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. కానీ దీప తీసుకోకుండా కోపంగా వెళ్లిపోతుంది. దీప (Deepa) హిమను తీసుకొని రోడ్డుపై వెళ్తూ సౌర్య (Sourya) ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. ఊరు మొత్తం అప్పు కోసం తిరుగుతుంది. కానీ ఎవరు కూడా అప్పు ఇవ్వడానికి ఇష్టపడరు.
 

46

మళ్లీ వారికి రుద్రాణి (Rudrani) ఎదురు వచ్చి డబ్బులు తీసుకోమని లేదంటే నీ బిడ్డకే ప్రమాదమని అంటుంది. అయినా కూడా దీప రుద్రాణి డబ్బులు తీసుకోకుండా వెళ్తుంది. మరోవైపు హాస్పిటల్ మారడంతో చావు బతుకుల మధ్యలో ఉన్న కూడా హిమ (Hima) ను చూడటానికి సమయం తీసుకుంటారు. దీంతో కార్తీక్ మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు.
 

56

దీప (Deepa) అప్పారావుకి ఫోన్ చేయడంతో అప్పారావు హాస్పిటల్ మార్చమని అంటాడు. ఇక దీప వచ్చి బాగా ఎమోషనల్ అవుతుంది. అంతలోనే కార్తీక్ బయటకు వెళ్తుండగా అప్పారావు తన దగ్గర ఉన్న డబ్బులు ఇస్తాడు. కార్తీక్ (Karthik) మెడికల్ షాప్ దగ్గరికి వెళ్లి ఒక ఆవిడకు మందులు లేకపోవడంతో వాటికి బదులుగా మరో మందులను ఇప్పిస్తాడు.
 

66

తను కూడా మందులు తీసుకొని అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఇక రుద్రాణి (Rudrani) కార్తీక్ వాళ్ళ కోసం హాస్పిటల్స్ తిరుగుతూ ఉంటుంది. తరువాయి భాగంలో డాక్టర్స్ ఈ ఆపరేషన్ చేయడం మా వల్ల కాదు అని.. కేవలం డాక్టర్ కార్తీక్ మాత్రమే చేస్తాడని అంటారు. ఇక దీప (Deepa) కార్తీక్ ను ఆపరేషన్ చేయమని బతిమాలుతోంది. కానీ కార్తీక్ మాత్రం ఈ పరిస్థితిలో ఎలా చేయాలి అని బాధపడతాడు.

click me!

Recommended Stories