చేతిలో చిల్లిగవ్వ లేదు.. నీ జీవితం నాశనం చేస్తారు, ఆ డైరెక్టర్ తో పడుకో అని బెదిరించారు

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 31, 2022, 06:51 PM ISTUpdated : Jan 31, 2022, 06:53 PM IST

కాస్టింగ్ కౌచ్ అనేది చిత్ర పరిశ్రమలో నటీమణులకు శాపంగా మారింది. అవకాశాల పేరుతో నటీమణులని లోబరుచుకుని వారిని లైంగికంగా వేధిస్తున్న సంఘటనలు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి.

PREV
16
చేతిలో చిల్లిగవ్వ లేదు.. నీ జీవితం నాశనం చేస్తారు, ఆ డైరెక్టర్ తో పడుకో అని బెదిరించారు

కాస్టింగ్ కౌచ్ అనేది చిత్ర పరిశ్రమలో నటీమణులకు శాపంగా మారింది. అవకాశాల పేరుతో నటీమణులని లోబరుచుకుని వారిని లైంగికంగా వేధిస్తున్న సంఘటనలు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. మీటూ ఉద్యమం తర్వాత చాలా మంది నటీమణులు తమపై జరిగిన వేధింపులని బయట పెడుతున్నారు. తాజాగా బుల్లితెర అందాల భామ దివ్యాంక త్రిపాఠి తనకు ఎదురైన సంచలన సంఘటన గురించి హాట్ కామెంట్స్ చేసింది. 

 

26

దివ్యాంక త్రిపాఠి హిందీ బుల్లితెరపై ఎన్నో టివి సీరియల్స్ లో నటించింది. నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. దివ్యాంకా త్రిపాఠి 2016లో తన కోస్టార్ వివేక్ దహియాని వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. తన భర్తతో వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. 

36

ఇదిలా ఉండగా దివ్యాంకా త్రిపాఠి తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో నటీమణులు ఎదుర్కొంటున్న సమస్యలు, బలహీనతల్ని ఆధారం చేసుకునే కొందరు వేధింపులకు దిగుతుంటారు. ఎవరైనా నటి తాను నటిస్తున్న సీరియల్, షో అయిపోయాక డబ్బు సమస్యలు మొదలవుతాయి. మరో కొత్త అవకాశం వచ్చే వరకు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. 

46

ఈఎంఐ లు, ఇతర బిల్లులు, అప్పులు వరుసగా నెత్తిమీద పడతాయి. ఆ సమయంలో వారి అవసరాన్ని కొందరు ఆసరాగా తీసుకుని కెరీర్ నాశనం చేయాలని చూస్తారు. నాకు కూడా లాంటి అనుభవం ఎదురైంది. నేను కొత్త ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నా.. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అలాంటి సమయంలో ఒక ఆఫర్ వచ్చింది. 

56

దీనితో ఆ డైరెక్టర్ ని కలిసేందుకు వెళ్లాను. డైరెక్టర్ కి చెందిన ఓ వ్యక్తి నా వద్దకు వచ్చాడు. నువ్వు డైరెక్టర్ తో ఒక రాత్రి గడిపితే నీకు మంచి ఆఫర్ ఇస్తారు అని చెప్పారు. నన్ను ఎందుకు  అడుగుతున్నారు అని గట్టిగా అడిగాను. దీనికి అతడు ఇచ్చిన సమాధానం.. నువ్వు తెలివైన దానివి.. ఆలోచిస్తావని అడిగాను అని బదులిచ్చాడు. 

66

ఇండస్ట్రీలో ఇవన్నీ సర్వసాధారణం, నువ్వు ఒప్పుకోకపోతే వాళ్ళు నీ కెరీర్ నాశనం చేస్తారు అని బెదిరించారు. అవేమి పట్టించుకోకుండా అక్కడి నుంచి లేచి వచ్చేశాను. వాస్తవానికి వాళ్ళు ఎంత బెదిరించినా ఏమీ చేయలేరు అని దివ్యాంక అన్నారు. మహా అయితే ఆ ఒక్క ఆఫర్ పోతుంది. కష్టపడితే మరిన్ని అవకాశాలు వస్తాయి. నేను ఇండస్ట్రీలో నా కష్టంతోనే పైకి వచ్చినట్లు దివ్యాంక పేర్కొంది. 

click me!

Recommended Stories