ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య, ఇంద్రుడి పై సీరియస్ అవుతూ నీకు అంతా తెలుసు ఎందుకు వాళ్ల గురించి నీకు అంత తెలిసి కూడా చెప్పు ఎందుకు దాస్తున్నావు అని నిలదీయడంతో అప్పుడు ఇంద్రుడు ఏమని చెప్పమంటారమ్మా మీరు కాలర్ పట్టుకున్నారు అని చనిపోయిన వాళ్ళని బతికున్నారని చెప్పమంటారా అని అనడంతో చనిపోవడం ఏంట్రా వాళ్ళు బతికే ఉన్నారు అని అంటుంది సౌందర్య. సౌర్య చెబుతుంటే అబద్ధం అనుకున్నాను కానీ హిమ కూడా చూసింది నా కొడుకు బతికున్నాడు అన్నది నిజం అని అనడంతో ఇంద్రుడు కార్తీక్ వాళ్ళు బతికే లేరు అని చెప్పడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.