Karthika Deepam: మోనితతో ఛాలెంజ్ చేసిన వంటలక్క.. ఫుల్ గా తాగుతున్న డాక్టర్ బాబు!

First Published Sep 19, 2022, 8:41 AM IST

Karthika Deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 19వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... కార్తీక్ శివ నీ, బీన్ బ్యాగ్ అని పిలుస్తాడు. అప్పుడు శివ, నన్ను అలా పిలవద్దు సార్ అని అనగానే,పేరు మర్చిపోయాను లేవయ్యా అని అంటాడు కార్తీక్.అప్పుడు శివ, మీరు అందరి పేర్లు మర్చిపోతారు కాని ఆ వంటలక్క పేరు మాత్రం గుర్తుంటాది అని అంటాడు. అప్పుడు దీప, కిటికీ దగ్గర నుంచి వీళ్ళ సంభాషణ వింటుంది. అవునయ్యా ఎందుకో తెలీదు, వంటలక్క పేరు,తనతో మాట్లాడిన మాటలు గుర్తుండిపోతాయి అని అంటాడు కార్తీక్. అప్పుడు శివ, సార్! మీరు ఏమి అనుకోకపోతే నాకు ఒక అలవాటు ఉన్నది సర్ ఎలాగో మేడం లేరు కదా అని అనగా నువ్వే వంట చేస్తావా అని అంటాడు కార్తీక్. లేదు సార్ అని శివ అనగా,పోనీ రాత్రికి ఇక్కడే పడుకోవాలనుకుంటున్నావా పడుకో అని అంటాడు కార్తీక్.అలా కాదు సార్ నాకు మందు తాగే అలవాటు ఉన్నది అని అనగా ఏం మాట్లాడుతున్నావ్ అయ్యా అని అంటాడు కార్తీక్. 

మీరు వద్దంటే వద్దులేండి సర్ అని అంటాడు శివ. ఎంత తాగుతావంటే సగం లీటర్ అని అంటాడు శివ. అయితే ఒక లీటర్ తెచ్చెయ్.నాకు అలవాటు ఉందో లేదో తెలుస్తుంది నాకు గుర్తులేదు కదా అని డబ్బులు ఇచ్చి పంపిస్తాడు కార్తీక్. అప్పుడు కిటికీ నుంచి దీప చూస్తూ, మీకెందుకు అలవాటు లేదు డాక్టర్ బాబు అని గతంలో ఒకసారి కార్తీక్ మందు బాటిల్ ఇచ్చిన సంఘటన గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడు దీప, డాక్టర్ బాబు ఇంకా నా మీద కోపంతో ఉన్నట్టున్నారు మంచి సమయం చూసి ప్రవేశిద్దామని అనుకుంటుంది.ఆ తర్వాత సీన్లో సౌందర్య, మోనిత,బాబుని ఎందుకు తీసుకెళ్లింది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఆనందరావు వచ్చి ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా అని అడగగా, ఇన్నేళ్లు బిడ్డ మీద రాని మమకారం,సడన్గా ఎందుకు వచ్చింది? ఆస్తి మొత్తం రాసిచ్చేసిందంటే బిడ్డని ఇంకా తెచ్చుకోకూడదని అనుకుంది కదా మళ్లీ ఎందుకు తీసుకువెళ్లింది? వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అని అడిగితే దీప వాళ్ళకి ప్రమాదం జరిగిన చోటు దగ్గరే ఉంటున్నారు కదా పేరు చెప్పడానికి ఏమీ.
 

ఆరోజు రెస్టారెంట్లో కూడా కంగారుగా వెళ్లిపోయింది. అయినా దాని జీవితంలో కార్తీక్ కన్నా పెద్ద లక్ష్యం లేదు. ఇప్పుడు కార్తిక్ ఏ లేనప్పుడు మళ్ళీ బిడ్డ ఎందుకు అని అంటాడు ఆనందరావు. అప్పుడు సౌందర్య, అయినా దీప వాళ్లకి ప్రమాదం జరిగిన చోటులో దానికి ఏం పని. బహుశా ఈ పని కూడా కార్తీక్ సంబంధించింది అయుంటదా? ఏదో పెద్ద పని చేస్తుంది. నేను ఒకసారి వెళ్లి తెలుసుకోవాలి అని అంటుంది సౌందర్య. ఆ తర్వాత సీన్లో, మందు బాటిల్ పట్టుకొని శివ వెళ్తూ ఉండగా దీప, శివని చూస్తుంది. అప్పటికే దీప చికెన్ పకోడీ వేస్తూ ఉంటుంది. దీప, శివా! అని పిలవగా శివ, వద్దు మల్లి మేడం తిడతారు అని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు దీప, తమ్ముడు శివ అని పిలుస్తోంది. అప్పుడు శివ, నన్ను ఎప్పుడు అందరూ ఒరే,గిరే అని పిలుస్తారు కానీ, ఎప్పుడూ వరస పెట్టి పిలవలేదు అని దీప దగ్గరికి వెళ్తాడు. అప్పుడు దీప,ఇద్దరు మందు తాగుతున్నట్టు ఉన్నారు, అందులో వేడివేడి చికెన్ పకోడీ వద్దా? అని అడగగా ఆలోచనలో పడతాడు శివ. 

నేను మీ మేడంకి చెప్పను లే తమ్ముడు,మీరు లోపలికి వెళ్ళండి పూర్తిగా అయిన తర్వాత పంపిస్తాను అని అంటుంది దీప. శివ ఎంతో ఆనందపడతాడు. ఆ తర్వాత సీన్లో శౌర్య, వారణాసిని రోడ్డు మీదకు పిలిచి, వారణాసి నిజం చెప్పు. నువ్వు తాతయ్య పంపిస్తేనే వచ్చేవు కదా అని అడుగుతాది. అప్పుడు వారణాసి, లేదు శౌర్యమ్మ నిన్ను వెతుక్కుంటూనే వచ్చాను అని అంటాడు వారణాసి.అప్పుడు శౌర్య,నాకు తెలుసు మీ అందరికీ నేను అంటే ఇష్టం. మీరందరూ మంచి వాళ్ళే కానీ నాకు దూరంగానే ఉండడం నాకు ఇష్టం అని అనగా, ఇప్పుడు ఆనంద్ రావు గారు నన్ను పంపించారు అని చెప్తే సౌర్యమ్మ నన్ను కూడా పంపించేస్తుంది అని వారణాసి మనసులో అనుకొని, లేదమ్మా నన్ను ఎవరు పంపించలేదు. ఒకవేళ పంపించినట్టయితే ఇప్పటికే మీ తాతయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చేసే ఉండేవారు కదా వాళ్ళ మాటని గౌరవిస్తున్నారు అని అంటాడు.

ఆ తర్వాత సీన్లో కార్తీక్, శివ ఇద్దరూ మందు తాగుతారు. అప్పుడు శివ, మీకు ముందే మందు అలవాటు ఉన్నట్టుంది సార్ అని అనగా, ఎందుకు అని కార్తీక్ అడుగుతాడు. మీరు నన్ను కంపెనీగా పిలిచారు తాగక ముందు చీర్స్ కొట్టారు ఇవన్నీ మందు తాగే అప్పుడు రూల్స్ అని అనగా, ఉన్నాదేమో లేవయ్యా అయినా ఇన్ని తెచ్చిన వాడివి స్టఫ్ తేలేదెందుకు అని అడుగుతాడు కార్తీక్.అప్పుడు శివ, వంటలక్క పకోడీ చేస్తా అన్నది కాదు సార్ అని చెప్తాడు. ఇంతలో దీప వచ్చి పకోడీ ఇస్తుంది. లేట్ అయిపోయింది డాక్టర్ బాబు అని దీప అనగా నువ్వు మా కోసం తెచ్చేవు, అదే ఎక్కువ వంటలు అక్క అని అంటాడు కార్తీక్.


అప్పుడు శివ మనసులో,మేడమ్ ఎంత తిట్టినా వంటలక్క ఎంతో ప్రేమగా ఉంటుంది. మేడం చెప్పిన కుళ్ళు కుతంత్రాలు ఏవి నాకు వంటలక్క దగ్గర కనిపించవు. ఇద్దరిలో ఎవరిది నిజం ఎవరిది నమ్మాలి. 

ఈరోజు ఆ విషయం ఏంటో కనుక్కుందాం అని అనుకుంటాడు. విషయం ఏంటో కనుక్కోవడానికి శివ దీప దగ్గరికి వెళ్ళగా ఇంతలో కార్తీక్,శివని పిలుస్తాడు.తర్వాత శివ కి ఫోన్ వచ్చింది అని మాట్లాడడానికి వెళ్తాడు. కార్తీక్, పకోడీ తింటూ టేబుల్ మీద యాపిల్స్ ఉన్నాయి వంటలక్క.అవి తే ఇందులో బాగుంటది అని అంటాడు. అప్పుడు శివ, ఆపిల్ తీసుకొని పది రోజులైంది కదా అనుకుంటాడు. దీప చూసేసరికి ఆపిల్స్ ఉండవు. లేవా! నేను తెచ్చినట్టు గుర్తుందే! నిన్ను చూడగానే నాకు ఆపిల్స్ ఎందుకు గుర్తొచ్చాయి అని అనుకుంటాడు. అప్పుడు దీప, కార్తీక్ తనకోసం గతంలో ఆపిల్ తెచ్చిన సంఘటనను గుర్తుతెచ్చుకుంటుంది. చిన్న చిన్నవి గుర్తొస్తున్నావ్ అంటే ఎప్పటికైనా మీరు పూర్తి గతం గుర్తుతెచ్చుకుంటారు అని నాకు నమ్మకం ఉంది డాక్టర్ బాబు అని అనుకుంటుంది. ఇంతలో కార్తీక్,వాడేమో  ఫోన్ మాట్లాడడానికి  వెళ్ళిపోయాడు. నువ్వేమి మాట్లాడట్లేదు ఏదైనా కథ చెప్పు వంటలక్క అని అనగా, నేను మా డాక్టర్ బాబు కథ చెప్తాను అని కార్తీక్ తో దీప ఒకరోజు మందు తాగిన కథ అంతా కార్తీక్ కి చెప్తుంది దీప.

అప్పుడు కార్తీక్, మీ డాక్టర్ బాబుకి నువ్వంటే ప్రేమ ఎక్కువ ఉన్నట్టున్నది అని అంటాడు. చాలా ఇష్టం కానీ ఇప్పుడు మాయా లోకంలో బతుకుతున్నారు అని అంటుంది దీప. అప్పటికే కార్తీక్ పడకుండిపోతాడు. మీరు నాతో మాట్లాడడమే చాలా తక్కువ మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు వినేస్థితిలో మీరు ఉండరు అని బాధపడుతుంది. ఇంతలో శివ వచ్చి సార్ పడుకున్నట్టు ఉన్నారు రా వంటలక్క పడుకోబెడదాం మంచం మీద అని పడుకోబెడతారు. ఇంతలో శివ, నేను వెళ్లి పడుకుంటాను వంటలక్క అని  అంటాడు. శివ వెళ్ళిపోయిన తర్వాత దీప కబోర్డ్ అంతా వెతుకుతుంది. అప్పుడు దీపకి  ఒక ఫైల్ దొరుకుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!