చీరకట్టులో కాజల్, టాప్ టూ బాటమ్ అద్భుతమే.. అందంలో మునుపటి జోరు చూపిస్తున్న చందమామ

Published : Sep 19, 2022, 08:37 AM IST

తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది.

PREV
18
చీరకట్టులో కాజల్, టాప్ టూ బాటమ్ అద్భుతమే.. అందంలో మునుపటి జోరు చూపిస్తున్న చందమామ

తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ లో ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్ కూడా కాజలే. 

28

కమర్షియల్ చిత్రాలతో కాజల్ తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలతో రాణిస్తోంది. కాజల్ కెరీర్ మొత్తంలో ఆమె సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడూ పడిపోలేదు. ఇది కాజల్ కు మాత్రమే సాధ్యమైన ఘనత. 

38

కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత ఈ జంట వెకేషన్స్ కి వెళుతూ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.  

48

కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఇటీవలే తల్లి అయింది. కాజల్ కిచ్లు దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. దీనితో కాజల్, కిచ్లు ఫ్యామిలీ సంతోషంలో మునిగిపోయింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. ముద్దుల కొడుకుకి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.   

58

ఇటీవల గర్భవతి కావడంతో కాజల్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. కొడుకు పుట్టేయడంతో కాజల్ తిరిగి సినిమాల్లో బిజీ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మునుపటి లుక్ పొందేందుకు ఈ చందమామ వర్కౌట్స్ షురూ చేసినట్లు తెలుస్తోంది. 

68

తాజగా కాజల్ అగర్వాల్ గ్రీన్, సిల్వర్ కాంబినేషన్ లో ఉండే శారీలో మైండ్ బ్లోయింగ్ ఫోజులు ఇచ్చింది.నిండైన చీరకట్టులో కాజల్ చందమామలాగా వెలిగిపోతోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో కాజల్ అందం రెట్టింపుగా కనిపిస్తోంది. కాజల్ ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

78

కాజల్ చివరగా తెలుగులో మోసగాళ్లు అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత కాజల్ ఆచార్య చిత్రంలో నటించాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. 

88

వివాహం తర్వాత కూడా కాజల్ కొన్ని సినిమాలకు కమిటై ఉంది. ముఖ్యంగా ఆమె తమిళంలో కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. గర్భవతి అయిన కారణంగానే కాజల్.. నాగార్జున ఘోస్ట్ చిత్రం నుంచి కూడా తప్పుకుంది. 

click me!

Recommended Stories