నాగ ఛైతన్య, సమంత కాంబినేషన్ లో వచ్చిన 'ఏమాయ చేశావే' చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. రొమాంటిక్ అండ్ ఎమోషనల్ కథతో యువతని ఈ మూవీ మెప్పించింది. నాగ చైతన్యకి ఇదే ఫస్ట్ హిట్. ఈ కథని ముందుగా మహేష్ బాబుతో చేయాలని గౌతమ్ మీనన్ అనుకున్నారట.