ఇంతలోనే డాక్టర్ బాబు అంటూ అక్కడికి వెళుతుంది. అప్పుడు డాక్టర్ బాబు అంటూ ఎమోషనల్ గా మాట్లాడగా నేను మీ డాక్టర్ బాబుని కాదు అనడంతో వెంటనే అక్కడికి ఎవరు కార్తీక్ అంటూ మోనిత వస్తుంది. అప్పుడు దీప,మోనిత ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు. అప్పుడు దీప ,మోనిత ను నిలదీయగా మోనిత దీప అంటే ఎవరో తెలియనట్టుగా నటిస్తుంది. అప్పుడు కార్తీక్,ఈమెకు నువ్వు ఎవరో తెలిసినప్పుడు నేను కూడా తెలిసి ఉంటుంది కదా అని అనగా మోనిత మాత్రం లేదు కార్తీక్ అది ఏదో పిచ్చిది అని అంటుంది.