సీనియర్ హీరో, నిర్మాతకి గుండెల్లో గుబులు పుట్టించిన నయనతార.. ఇది మరీ దారుణం కదా ?

First Published | Aug 30, 2022, 7:01 AM IST

ఈ మధ్యనే సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు విగ్నేష్ శివన్ తో సహజీవనానికి ఫుల్ స్టాప్ పెడుతూ అధికారికంగా పెళ్లి చేసుకుంది.

ఈ మధ్యనే సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు విగ్నేష్ శివన్ తో సహజీవనానికి ఫుల్ స్టాప్ పెడుతూ అధికారికంగా పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం విగ్నేష్, నయనతార మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. వివాహం తర్వాత నయనతార నిర్మాతలకు మరిన్ని కండిషన్స్ పెడుతూ తలనొప్పుగా మారుతోంది అంటూ ఫిలిం సర్కిల్స్ లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. 

తమ చిత్రాల్లోకి నయన్ ని తీసుకుందాం అని ఆమెని సంప్రదించడానికి వెళ్లినా సరే నిర్మాతలకు దిమ్మతిరిగే షాక్ లు తప్పట్లేదట. నయనతార డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్ తో మీడియం రేంజ్ ప్రొడ్యూసర్స్ ఆమెతో సినిమా చేసేందుకే భయపడుతున్నారు. ఇక పెద్ద నిర్మాతల్లో కూడా ఆమె గురించి చర్చ మొదలైనట్లు తెలుస్తోంది. 


సౌత్ లో నయనతార మోస్ట్ క్రేజీ హీరోయిన్. అందులో సందేహం లేదు. సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ కూడా నయనతారనే. ఒకప్పుడు నయనతార రూ 3 కోట్ల పారితోషికం తీసుకుంటూ సౌత్ లో రికార్డ్ సృష్టించింది. ఆమెకి ఉన్న క్రేజ్ దృష్ట్యా అంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ప్రొడ్యూసర్స్ వెనుకాడలేదు. కానీ ఇటీవల నయన్ రెమ్యునరేషన్ 5 కోట్లకు చేరింది. 

నితిన్ నటించిన మ్యాస్ట్రో మూవీలో మొదట నయనతారని సంప్రదించినట్లు అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ నయన్ 5 కోట్లు డిమాండ్ చేయడంతో మేకర్స్ డ్రాప్ అయ్యారు. చివరకి తమన్నాని తీసుకున్నారు. ఇక వివాహం తర్వాత నయన్ డిమాండ్స్ కి రెక్కలొచ్చినట్లు టాక్. రెమ్యునరేషన్ భారీగా పెంచేసి ప్రొడ్యూసర్స్ కి భారంగా మారుతోంది ఈ హాట్ బ్యూటీ. 

ప్రస్తుతం నయన్ రూ.7 కోట్లు డిమాండ్ చేస్తోందట. టాలీవుడ్ సీనియర్ హీరో చిత్రం కోసం ఓ నిర్మాత రీసెంట్ గా నయనతారని సంప్రదించారట. ఏకంగా ఆమె 7 కోట్లు డిమాండ్ చేయడంతో నిర్మాత నోటి వెంట మాట రాలేదు. అంతటితో ఆగిందా అంటే లేదు.. తన సిబ్బంది ఖర్చుల కోసం రోజుకి రూ 1 లక్ష.. ఫ్లైట్ చార్జెస్, హోటల్ బిల్స్, తన స్టాఫ్ తాను ప్రయాణించేందుకు స్పెషల్ కాన్వాయ్ ఇలా చాంతాడంత లిస్ట్ చెప్పుకొచ్చిందట. 

షూటింగ్ పూర్తయ్యే సరికి రెమ్యునరేషన్ తో సహా ఆమె ఖర్చులు మాత్రమే రూ 10 కోట్లు సమీపించినా ఆశ్చర్యం అవసరం లేదు. దీనితో సదరు నిర్మాత వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. మరో హీరోయిన్ ని చూసుకుంటే బెటర్ అని భావిస్తున్నారట. ఇదే కనుక జరిగితే నయన్ తెలుగులో మరిన్ని చిత్రాలు చేయడం కష్టమే అనే అభిప్రాయం వినిపిస్తోంది. 

ఎందుకంటే ఒక స్టార్ హీరో సినిమాలో నయన్ నటించాలంటే.. హీరో, నయన్ రెమ్యునరేషన్స్ మాత్రమే 30 కోట్లు దాటిపోయే ఛాన్స్ ఉంది. ఇది నిర్మాతకి పెను భారమే అవుతుంది. రూ 2 కోట్ల రెమ్యునరేషన్ కి సినిమా చేసే క్రేజీ హీరోయిన్స్ ఉన్నప్పుడు దాదాపు రూ 10 కోట్లు వృధా చేసుకోవడం ఎందుకు అని నిర్మాతలు భావిస్తారు. 

Latest Videos

click me!